Sunday, January 23, 2022

Extra Marital Affair : మహిళ హత్య-భర్త వివాహేతర సంబంధం | Extra Marital Affair

కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పరాయి స్త్రీలతో తిరుగుతున్న భర్తను ప్రశ్నించినందుకు భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.

Extra Marital Affair :   కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పరాయి స్త్రీలతో తిరుగుతున్న భర్తను ప్రశ్నించినందుకు భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్‌బి ని, ఆరు సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా బేతంచర్ల సమీపంలోని బైడ్‌పేట కు చెందిన హుస్సేన్ భాషాకు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు.

అయితే హుస్సేన్ భాషా పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను తరచు వేధిస్తూ ఉండేవాడు.  భర్త వేధింపులు తట్టుకోలేని హుస్సేన్‌బి  కొద్దికాలం క్రితం  భర్తను విడిచి  తల్లిదండ్రుల వద్దకు వచ్చి  ఉంటోంది.  ఇటీవల భాషా భార్య హుసేన్‌బి ని తీసుకువెళ్లేందుకు అత్తగారింటికి వచ్చాడు. తాను పూర్తిగా మారిపోయానని భార్యను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి వారిని నమ్మించాడు.

Also Read : Red Sandalwood : రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

అతని మటాలు నమ్మిన అత్తమామలు హుస్సేన్‌బి ని భాషాతో కాపురానికి  పంపించారు.  భార్యను తీసుకుని తిరిగి బేతంచెర్లకు వెళ్ళాడు. అప్పటికే భార్యపై కోపం పెంచుకుని ఉన్న హుస్సేన్ భాషా నిన్న రాత్రి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో హుస్సేన్‌బి ఆ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడికి శిక్షపడేలా చూడాలంటూ హుస్సేన్ బి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...