Sunday, January 23, 2022

Bigg Boss 5 Telugu : సిరిని మానసిక అత్యాచారం చేస్తున్నారంటూ… బిగ్ బాస్ పై ఫైర్ అయిన నటి మాధవి లత..: | The Telugu News


బిగ్‌బాస్‌ సీజన్ 5 14 వారం ముగింపు దశకు వచ్చేసింది. సీజన్ మొదటి నుంచి సిరి- షణ్నుల మధ్య బంధాన్ని బిగ్ బాస్ బాగా హైలైట్‌ చేస్తూ వచ్చాడు. అసలు వాళ్ళది స్నేహమా.. ప్రేమ బంధమా తెలియక హౌస్ లోని సభ్యులు, బయట వారు జుట్టు పీక్కుంటు న్నారు. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. షో చివరి ఆఖరికి వచ్చిన వీరిద్దరి పెయిర్ మరి ఇరిటేటింగ్ గా తయారవుతుంది. ఇప్పటిదాకా సిరితో అంటి పెట్టుకొని తిరిగిన షన్ను… ఆమెను బ్యాడ్ చేస్తూ ఆమె చేసిన ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఆమెపై పెత్తనం చెలాయిస్తున్నాడు. సిరి ఎప్పుడేం చేయాలో కూడా తానే నిర్ణయిస్తూ ఆమె గేమ్ ను అతనే ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా… ఇన్ని రోజులు సిరిపై విరుచుకుపడ్డ నెటిజన్లు.. ఇప్పుడు షన్నును గట్టిగా వేసుకుంటున్నారు. వీరితో సహా..

Bigg Boss 5 Telugu : సిరి, షన్నులా బంధం ఏంటో అర్ధం కావడం లేదు..!

Madhavi latha Coments on bigg boss 5 Telugu siri shanmukh relation

మొదటి నుంచి బిగ్ బాస్ పై రివ్యూస్ ఇస్తూ వస్తున్న నటి మాధవి లత ఈ వ్యవహారం పై తనదైన రీతిలో స్పందించారు. వివాదాస్పద విషయాల్లో ఎప్పుడు ముందు ఉండే మాధవి లత తాజాగా బిగ్ బాస్ హౌస్ లోని సిరి, షన్ను ల బంధంపై పడ్డారు. ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీమ్‌ మీది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎంటా అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేస్తూ… నవ్వ కూడదు.. ఏడ్వ కూడదు.. వంగ కూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. మీ టీమ్ అంతా ఏం చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిపై షన్ను కమాండింగ్ ను తప్పు పడుతూనే సిరిని సైతం ఓ రేంజ్ లో వేసుకుంది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం చూపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. మంచి గేమ్ ను ఇలాంటి వాటితో పాడు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.

అయితే సిరి, షన్ను ల బంధం పై మాధవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మాధవి లత నచ్చావులే – స్నేహితుడా అనే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాధవికి చెప్పుకోవాల్సిన హిట్ కాదు కదా.. సినీ అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. కరోనా సమయం నుంచి ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో ఆక్టివ్ గా మారింది. ఇటీవల భాజపా పార్టీలో చేరిన ఈమె… సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తునే, బిగ్ బాస్ షో పై తనదైన రీతిలో రివ్యూ ఇస్తూ ఉంటుంది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...