Friday, January 21, 2022

One Wife, Two Husbands : ఇద్దరు పిల్లల తల్లి-ఇద్దరు భర్తల పెళ్లాం….భార్య కోసం భర్తల గొడవ | One Wife, Two Husbands

సమాజంలో వివాహం…కుటుంబ వ్యవస్ధ, కట్టుబాట్లు  అడుగంటి పోతున్నాయి. పెళ్లై 22 ఏళ్లు కాపురం చేసి.. ఇద్దరు పిల్లలకు తల్లైన మహిళ ఇప్పుడు వాళ్లను వదిలేసి.. తనకు నచ్చిన మరోక వ్యక్తిని పెళ

One Wife, Two Husbands : సమాజంలో వివాహం…కుటుంబ వ్యవస్ధ, కట్టుబాట్లు  అడుగంటి పోతున్నాయి. పెళ్లై 22 ఏళ్లు కాపురం చేసి.. ఇద్దరు పిల్లలకు తల్లైన మహిళ ఇప్పుడు వాళ్లను వదిలేసి.. తనకు నచ్చిన మరోక వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఒకే మహిళ కోసం ఇద్దరు భర్తలు గొడవపడుతున్న ఘటనతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఇద్దరు భర్తలు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఆ మహిళ నాక్కావాలంటే నాక్కావలని ఇద్దరూ కొట్టుకుంటున్న విచిత్ర ఘటన హైదరాబాద్, వరంగల్లో చోటు చేసుకుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ టీచర్స్ కాలనీ-2 లో లంకా శశికాంత్(42) భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యదేవి(35)తో కాపురం ఉంటున్నాడు. వీరిద్దరికి 1999 ఫిబ్రవరి 2న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. వీరికి 16 ఏళ్ల కుమారుడు…13 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

సుశీల శశికాంత్ ల 1999 నాటి పెళ్లి ఫోటో

ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన సుశీల మళ్లీ తిరిగి రాలేదు. ఇంట్లోని 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె పరారయ్యింది. భార్య కోసం తెలిసిన చోటల్లా గాలించినా ఆమె ఆచూకి లభించలేదు. చివరికి ఆమె ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యవరప్రసాద్ తో పారిపోయిందని భర్త శశికాంత్ తెలుసుకున్నాడు.

ఇంట్లోని బంగారం, వెండి. డబ్బుతీసుకుని తన భార్య వరప్రసాద్‌తో  పారిపోయిందని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గా సుశీలను, ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్‌ను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. సుబేదారి పోలీసు స్టేషన్‌లో ఇద్దరి మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నించగా… శశికాంత్ తన మొదటి భర్త కాదని… తన అక్క చనిపోతే చుట్టపు చూపుగా వెళ్లానని… ఆ పిల్లలు తన పిల్లలు కాదని ట్విస్ట్ ఇచ్చింది.

Also Read : Sexual Harassment : నాతో సినిమాకు వస్తే పింఛన్ శాంక్షన్ చేస్తా…

పోలీసులు విచారణ చేపట్టగా శశికాంత్ ఆమె భర్తే నని, పిల్లలు సుశీల పిల్లలేనని తేలటంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కు పంపారు.  జైలు నుంచి విడుదలయ్యాక ప్రియుడు సత్యవరప్రసాద్‌తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్‌లో  కాపురం పెట్టి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఆ తర్వత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాలలో సుశీల మెడలో ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్ మూడు ముళ్లు వేసి భార్యగా చేసుకున్నాడు.

సుశీల ఆమె ప్రియుడు రాయుడు సత్యవరప్రసాద్ ల పెళ్ళి ఫోటో

సుశీల ఆమె ప్రియుడు రాయుడు సత్యవరప్రసాద్ ల పెళ్ళి ఫోటో

ఈక్రమంలో శశికాంత్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లలకు తల్లిప్రేమ కావాలి.. నాభార్యను నాకు అప్పగించండి అని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఉండగా రెండో భర్త సత్యవరప్రసాద్ ఇంటి నుంచి సుశీల అదృశ్యమయ్యింది.  దీంతో రెండో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  3నెలల గర్భవతి అయిన తన భార్య  కనిపించటంలేదని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల  ఆచూకి  వెతికే పనిలో పడ్డారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...