Wednesday, January 19, 2022

Telangna Corona Cases : తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు | Telangana Reports 201 New Corona Cases


తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. కరోనాతో మరొకరు మరణించారు.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. కరోనాతో మరొకరు మరణించారు. గత 24 గంటల్లో 184 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,77,747కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,69,857కి చేరుకుంది. రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 312 మంది వచ్చారు.

SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దేశాన్ని కరోనా పీడ వదిలేలా లేదు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మన దేశంలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్

గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. కరోనా నిబంధనలు పాటించాల్సిందే అన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, అలాగే అర్హులందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...