Friday, January 21, 2022

Manchu Vishnu : సైనికుడు సాయితేజ భార్యకు ఫోన్ లో మంచు విష్ణు పరామర్శ | Manchu Vishnu, President of the MAA Consold Shyamala, wife of Saiteja, a soldier killed in a helicopter crash

హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుడు సాయితేజ కుటుంబాన్ని ’మా‘ అధ్యక్షులు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామలను ఫోన్ లో ఆయన పరామర్శించి, ఓదార్పారు.

Manchu Vishnu Consold family of Saiteja : హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుడు సాయితేజ కుటుంబాన్ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు ఫోన్ లో పరామర్శించారు. సాయితేజ భార్య శ్యామలను ఫోన్ లో మంచు విష్ణు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, సాయితేజ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలను తానే చదివిస్తానని శ్యామలకు హామీ ఇచ్చారు. 10 రోజుల్లో తానే వచ్చి కలుస్తానని తెలిపారు.

తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్‌ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

2015 లో సిద్ధారెడ్డి పల్లికి చెందిన శ్యామలతో సాయితేజ్​కు వివాహం అయింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ(4), కూతురు దర్శిని(2) ఉన్నారు. వీరి కుటుంబం మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటోంది. ఇవాళ ఉదయమే సాయితేజ్ వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిసారిగా గత వినాయకచవితికి స్వగ్రామం ఎగువ రేగడకు సాయితేజ్‌ వచ్చి వెళ్లినట్లు కుటుంబసభ్యులు గుర్తుచేసుకుంటున్నారు.

2013లో సాయితేజ్ ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్​ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులో సైనికులకు శిక్షకుడిగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సాయితేజ్ తమ్ముడు కూడా ఆర్మీలోనే సేవలందిస్తున్నారు. సాయితేజ్ మహేష్ బాబు సిక్కింలో ఆర్మీ విధులు నిర్వహిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి జగన్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివేనా ? పేర్ని నాని అలా తీసి పడేశారేంటి ?

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌ సమావేశం అయ్యానని చిరంజీవి ప్రకటించారు. తాము ఏమేమీ మాట్లాడుకున్నామో వివరించారు. తాను చెప్పినవన్నీ సీఎం జగన్...

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Latest Articles

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

దిగ్విజయంగా విలీన ఘట్టం.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో అమర్ జవాన్ జ్యోతి

ప్రధానాంశాలు:చారిత్రక ఘట్టమన్న కేంద్ర ప్రభుత్వంజ్యోతుల విలీనం సరికాదన్న విపక్షాలురెండు జ్యోతులు ఎందుకు ఉండకూడదన్న నేతలున్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని దానికి సమీపంలో ఉన్న జాతీయ...