Friday, January 21, 2022

AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే.. | Andhra Pradesh Reports 193 New Corona Cases

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏపీలో 31వేల 101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి..

AP Corona : ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏపీలో 31వేల 101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ తో మరణించారు. ఇదే సమయంలో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Amazon Prime: డిసెంబర్ 13వ తేదీలోపు అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఇదే!

ప్రస్తుతం రాష్ట్రంలో 2,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,74,410కి చేరుకుంది. మొత్తం 20,57,913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,460కి పెరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పటకే 57 దేశాలను చుట్టేసింది. భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్‌ కేసులు మన దేశంలో నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోక ముందే.. ఇక, థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదన్న హెచ్చరికలు కలవర పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు తేల్చి చెప్పారు. కరోనా నిబంధనలు పాటించాల్సిందే అన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, అలాగే అర్హులందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.Related Articles

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

Latest Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...