Wednesday, January 19, 2022

Pawan Kalyan : పవన్ ‘భీమ్లా నాయక్’లో బ్రహ్మానందం రోల్ అదే.. ఇక నవ్వుల సంబురాలే.. | The Telugu News

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు జనసేనాని. ఈ సంగతి అలా ఉంచితే.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. పవన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘భీమ్లా నాయక్’ ఫిల్మ్‌లో బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘భీమ్లానాయక్’ సినిమాలో తాను నటించినట్లు బ్రహ్మానందమే స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కొద్ది రోజుల నుంచి బ్రహ్మానందం వెండితెరపైన కనబడుట లేదు. తన వ్యక్తిగత, ఇతర కారణాల రిత్యా బ్రహ్మానందం సినిమాలు చేయలేదు. కాగా, ‘భీమ్లానాయక్’ సినిమా నుంచి వరుస మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నారు బ్రహ్మానందం. కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని సిల్వర్ స్క్రీన్‌పైన చూస్తే సినీ అభిమానులు, ప్రేక్షకులు తెగ ఆనందపడిపోతున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గతంలో పవన్ కల్యాణ్-బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగా, ఈ సారి ‘భీమ్లానాయక్’లో సీన్స్ వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.

pawan kalyan brahmanandam in pawan bheemla nayak film cine lovers feeling happy

Pawan Kalyan : ఇక థియేటర్స్‌లో నవ్వులు పూయాల్సిందే.. వేరే లెవల్‌లో పవన్-బ్రహ్మీ సీన్స్..

ఈ కామెడీ సీన్స్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఉండబోతున్నది. ‘భీమ్లా నాయక్’ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సాగర్‌.కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకూ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి బరిలో విడుదల కానుంది.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...