Wednesday, January 26, 2022

Rowdy Sheeter : పుస్తకాలు, పెన్నులు ఆశచూపి ఆడపిల్లలపై లైంగిక వేధింపులు..రౌడీ షీటర్ కు దేహశుద్ధి చేసిన మహిళలు | Locals attacked rowdy sheeter ChinnaRao for sexually abusing girls in visakha malkapuram

విశాఖ మల్కాపురంలో రౌడీ షీటర్ దారుణానికి ఒడిగట్టాడు. పుస్తకాలు, పెన్నులు ఆశచూపి ఆడపిల్లలపై రౌడీ షీటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్థానికులు, మహిళలు అతనికి దేహశద్ది చేశారు.

rowdy sheeter for sexually abusing girls : విశాఖ మల్కాపురంలో రౌడీ షీటర్ దారుణానికి ఒడిగట్టాడు. పుస్తకాలు, పెన్నులు ఆశచూపి ఆడపిల్లలపై రౌడీ షీటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, మహిళలు రౌడీషీటర్ చిన్నారావుకు దేహశుద్ధి చేశారు. స్థానిక మహిళలు రోడ్డుపైనే అతన్ని చితకబాదారు. అనంతరం మల్కాపురం పోలీసులకు అప్పగించారు.

మల్కాపురంకు చెందిన దోమన చిన్నారావు అనే వ్యక్తి చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. స్థానిక నేతలు ఇచ్చిన సహకారంతో రౌడీ షీటర్ రెచ్చిపోతున్నాడు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ ఇంటికి తీసుకెళ్లి..వర్ణించలేని విధంగా బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తల్లీదండ్రులకు చెబితే ఏమౌతుందోనని భయపడి బాలికలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.

Huge Investment In Telangana : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. జర్మన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ

ఈ నేపథ్యంలో ట్యూషన్ కు వెళ్లిన బాలికలు ఉపాధ్యాయుడికి విషయాన్ని తెలిపారు. పుస్తకాలు, పెన్నులు, డ్రస్సులు ఇస్తానని ఆశచూపి 6 వ తరగతి నుంచి 10 వ తరగతి చదివే విద్యార్థినుల పట్ల చిన్నారావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాలికలు ఉపాధ్యాయుడికి చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు.. బాలికల తల్లిదండ్రులు, స్థానికులను పిలిపించి చిన్నారావు వ్యవహారాన్ని తెలిపారు.

దీంతో ఆగ్రహించిన స్థానికులు, మహిళలు రౌడీ షీటర్ చిన్నారావుకు దేహశుద్ధి చేశారు. చిన్నారావు తిరగబడే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలంతా కలిసి అతనికి దేహశుద్ధి చేసి మాల్కాపురం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పోలీసులు పొక్సో యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

covid-19 vaccine : నాకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా

పుస్తకాలు, పెన్నులు ఆశచూపి అభంశుభం తెలియని బాలికలపై రౌడీ షీటర్ చిన్నారావు అఘాయిత్యం చేయడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికలు చెప్పుకోలేని రీతిలో ప్రవర్తించడం పట్ల స్థానికులు, మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్నారావును కఠినంగా శిక్షించాలని..లేదంటే అతని అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

Latest Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...