Friday, January 28, 2022

Mahesh Babu : మహేష్ బాబు – పూరీ మళ్ళీ చేతులు కలపనున్నారా.. ఆసక్తి రేపుతోన్న సూపర్ స్టార్ కామెంట్స్! | The Telugu News


Mahesh Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించింది పోకిరి సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లతో పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మేన్ కూడా అదే స్థాయిలో ఆడింది. అనంతరం వీరిద్దరూ తమ కాంబినేషన్ లో మూడో సినిమాగా జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించారు. పలు కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. మహేష్ కారణంగానే మూవీ క్యాన్సిల్ అయిందని పూరీ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తన వల్ల హిట్స్ సొంతం చేసుకున్న ఓ స్టార్ హీరో ఇప్పుడు తనను లెక్క చేయడం లేదని పరోక్షంగా పలుమార్లు వాపోయారు. దీంతో పూరీకి మహేష్ కు మధ్య విబేధాలు వచ్చాయని అంతా అనుకున్నారు.

కానీ ఇటీవల మహేష్ పూరీ పట్ల చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం వారి అంచనాలను తారుమారు చేస్తూ అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా మహేష్ తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ షో జరిగిన ఓ సంఘటన ఆసక్తి కలిగించేలా ఉంది. గేమ్ లో ఓ సెగ్మెంట్ లో భాగంగా.. ఫ్రెండ్ తో ఫోన్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు మహేష్ జాబితాలో మొత్తం తనతో పనిచేసిన ఆయన దర్శకులనే ఎంచుకున్నారు. అందులో కొరటాల శివతో పాటు పూరీ జగన్నాధ్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు వంశీ పైడిపల్లి… ఈ అయిదుగురి పేర్లు స్క్రీన్ పై తారసపడటం గమనార్హం. ఈ అయిదుగురు పేర్లలో పూరీ జగన్నాధ్ పేరు అంచనాలకు అందనిదిగా ఉంది.

mahesh babu comments on puri jagannath

Mahesh Babu : దర్శకుడు పూరీపై సానుకూలంగా స్పందించిన ప్రిన్స్

అంతేకాదు ఈ షోలో ‘సర్కార్ వారి పాట’ సినిమాపై స్పందించిన మహేష్… ఈ చిత్రం పూరీ గారి స్టైల్ లో ఉంటుందంటూ ఇందులో ‘ పోకిరి’ మూవీ వైబ్స్ ఉంటాయని ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అందుకు గత కొంత కాలంగా మహేష్ పూరీల మధ్య కొనసాగుతూ వస్తున్న వివాదాలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు నాడు కూడా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం అప్పట్లో వైరల్ గా మారింది. ఏదీ ఏమైనప్పటికీ ఇక్కడితో విభేదాలు తొలగి పోయి వారిద్దరి కాంబినేషన్ లో జనగణమన తెరకెక్కి.. ‘హ్యాట్రిక్’ మూవీగా నిలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

Related Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

Latest Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...