Friday, January 28, 2022

ఆస్కార్ రేంజ్ లో షార్ట్ ఫిల్మ్.. ఓటింగ్ కు వెళ్తున్న మనసా నమః ..

తెలుగులో నిర్మించిన మనసా నమః అనే షాట్ ఫిలిం ఆస్కార్ ఓటింగ్‌కు వెళుతోంది. విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన షార్ట్ ఫిలిం మనసానమః.. ఇందులో ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో డైరెక్ట‌ర్‌ దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా మనసా నమః షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. పోయిన సంవ‌త్స‌రం యూట్యూబ్ లో రిలీజైన ఈ షార్ట్ ఫిలిం.. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్ర‌ద‌ర్శించ‌గా 900 పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది.

ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక అవార్డులకు క్వాలిఫై అయ్యింది. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న మనసానమః కు ఈ నెల 10నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు దీపక్ తోపాటు నటీనటులు విరాజ్, దృషిక, సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనసానమః చిత్ర విశేషాలను, ఆస్కార్ పోటీలో ఎంపికపై వివరాలను వెల్లడించారు.

దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు కంప్లీట్ రివర్స్ స్క్రీన్ ప్లేతో మ్యూజికల్ గా చేద్దామని అనుకున్నాం. కథను మొత్తం రివర్స్ లో తీయడం షూటింగ్ టైమ్ లో పెద్ద ఛాలెంజ్. ప్రొడక్షన్ టైమ్ లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. మంచి టీమ్ తో అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించాం. మనసానమహా కు ఇంటర్నేషనల్ గా వందల అవార్డులు రావడం మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్ లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. నా అభిమాన దర్శకుడు సుకుమార్. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నాను’ అన్నారు. హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఒక తెలుగు షార్ట్ ఫిలింకు ఇంటర్నేషనల్లీ 900 పైగా అవార్డ్స్ రావడం గర్వంగా ఉంది. ఆడియెన్స్ అందరికీ థాంక్స్ చెబుతున్నాం. ఆస్కార్ క్వాలిఫై ఓటింగ్ పై పాజిటివ్ గా ఉన్నాం.’ అన్నారు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...