Friday, January 28, 2022

Telangana : ధాన్యం కొనేది లేదు..రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి : మంత్రి సింగిరెడ్డి rice grain No procurement minister niranjan reddy

ధాన్యం కొనేది లేదు..రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ శాకా మంత్రి సింగిరెడ్డి రైతులకు సూచించారు.

Rice grain No procurement minister niranjan reddy  : ధాన్యం కొనుగోలు విషయంలో ఇటీవల కాలంలో తెలంగాణలో ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు మీది అంటే కాదు మీది అంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేస్తే..ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షమేనని కేంద్రం అంటూ విమర్శించుకున్నాయి. వీరిద్దరి నడుమ రైతులు గిట్టుబాటు ధర లభించక విలవిల్లాడిపోయారు.ఈక్రమంలో ధాన్యం కొనేది లేదని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటికీ..ఖరీఫ్ పంట కల్లాల్లో నుంచి కదలనేలేదు. కానీ యాసంగి పంట గురించి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇంటిమేషన్ ఇస్తోంది.

Read more : Finger Millet : వేసవిలో రాగి పంటసాగు..యాజామాన్య పద్దతులు

ధాన్యం కొనేది లేదని ఇక రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచనలిస్తోంది. యాసంగిలో వేసే వరి పంటను ఎట్టి పరిస్థితిలో కొనేది లేదని..కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని..వరి ధాన్యం వేస్తే మాత్రం రైతులు ఇబ్బందులు పడతారని మంత్రివర్యులు హెచ్చరిస్తున్నారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచిస్తున్నారు. రైతుల సంక్షేమం గురించి తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో ఉందని ఓ పక్క చెబుతునే మరోపక్క ధాన్యం కొనేది లేదని చెబుతోంది. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వంపై కోపం తెచ్చుకోకుండా..ఆ కోపాన్ని కేంద్రం ప్రభుత్వపైకి నెట్టలనుకుంటోంది. దీంట్లో భాగంగా బీజేపి ప్రభుత్వాన్ని రైతుల ముందు దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.

Read more : TTD properties : టీటీడీ చరిత్రలో తొలిసారి..తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల

ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతోందని..రైతుల కోసం నిలబడేది టీఆర్ఎస్ మాత్రమేనని చెబుతున్నారు మంత్రి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని..ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్ సీఐ బాధ్యత తీసుకుంటుదని అన్నారు. తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ కేంద్రానికి పదే పదే విన్నవిస్తు లేఖలు రాసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనరాలేదని అసహనం వ్యక్తం చేసారు మంత్రి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు యాసంగిలో కూడా వరి పంటే వేస్తే ఇబ్బందులు పడతారని నష్టాల్లో కూరుకుపోతారని చెబుతున్నారు. కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా..ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...