Friday, January 21, 2022

Yasangi Paddy Crop : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి-నిరంజన్ రెడ్డి | Yasangi Paddy Crop

కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని…పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి   ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yasangi Paddy Crop :  కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే రైతులు నిండా మోసపోతారని…పేద ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవటంలేదని వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి   ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి వరి పంట నష్టపోకూడదనే ..ముందస్తుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన రైతులను కోరారు. వానాకాలం వరి పంటను కొంటాం.యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలను వేసుకుందామని ఆయన అన్నారు.

టీఆరెస్ ఎంపీలు  పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని….కేంద్ర ప్రభుత్వం కొనుగోలు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తారు కానీ కొనాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని ఆయన చెప్పారు. రా రైస్ కు… బాయిల్డ్ రైస్ కు తేడా తెలియని బీజేపీ ఎంపీలు ఇక్కడ ఉన్నారని దుయ్యబట్టారు.

వానాకాలం పంట కొంటున్నాం కదా అంటున్నారు…కానీ యాసంగి పంట కొంటారా లేదా చెప్పట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి వడ్లు నూకలు అవుతాయి కాబట్టి బాయిల్డ్ రైస్ వస్తాయి దీన్ని కొంటారో కొనమని కేంద్రం చెపుతోంది అంటే ఈ రాష్ట్రంలో పండించే మొత్తం రైస్ తీసుకోమని చెప్పినట్లేగా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం రైతుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని  మంత్ర్రి విమర్శించారు.

దేశవ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యతను విస్మరించిన పీయూష్‌గోయల్‌ పార్లమెంటును తప్పుదారి పట్టించారని  అన్నారు.  రాష్ర్టాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత తమదేనన్న ఇంగితజ్ఞానం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేయడం దుర్మార్గమని  కేంద్రంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు, మి ల్లింగ్‌, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని నిరంజన్ రెడ్డి  స్పష్టం చేశారు.
Also Read : Rythu Bandhu : రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!
రాజకీయాల కోసం రైతులను,ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీకి రైతుల దీక్షలు కనిపించట్లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును పసిగట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగాన్ని ప్రత్యామ్నాయపంటలవైపు మళ్ళిస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు.

వానాకాలం లో అకాల వర్షాల వలన దాన్యం తడిస్తే కూడా కొనుగోలు చేస్తున్నామని…రంగు మారిన దాన్యంను కొనుగోలు చేస్తున్నామని… రంగు మారిన, తడిసిన దాన్యంకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నమని నిరంజన్ రెడ్డి చెప్పారు.ఎట్టిపరిస్థితుల్లోనూ యాసంగిలో రైతులు వరి వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదు…. మీరు వేసుకుంటే మీ ఇష్టం….విత్తనాల కోసం ఇతర అవసరాలకు మీరు వరి వేసుకోవచ్చుఅని మంత్రి సూచించారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...