Friday, January 28, 2022

Suicide Attempt : ప్రాణం మీదకు తెచ్చిన పెద్దమనుషుల పంచాయతీ తీర్పు | Suicide Attempt

గ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తా

Suicide Attempt :  గ్రామంలో జరిగిన పెద్దమనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా పెద్దమనుషులు జరిమానా విధించారని మనస్థాపంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది

పాలకుర్తి మండలం లక్ష్మీ నారాయణ పురం గ్రామానికి చెందిన మజ్జిక వీరాస్వామి అనే వ్యక్తి తన 17 కుంటల భూమిని గ్రామానికి చెందిన బద్రి అనే వ్యక్తికి విక్రయించాడు. వీరాస్వామికి డబ్బులు ఇవ్వకుండానే భూమిని బద్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదే భూమిని బద్రి గ్రామానికి చెందిన మజ్జిక మల్లయ్య అనే వ్యక్తికి తిరిగి విక్రయించాడు. విషయం తెలుసుకున్న వీరాస్వామి మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.
Also Read : Jabardasth Anchor Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
గ్రామంలో కొంత మంది పెద్దలు..వీరాస్వామి శవం వుండగానే పంచాయతీ పెట్టారు. వీరాస్వామిని మోసం చేసి అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని..ఆ భూమి వీరాస్వామికే చెందాలని తీర్పునిచ్చారు. అంతే కాకుండా వీరాస్వామి మృతికి మల్లయ్య, బద్రిలే కారణమని తీర్పు ఇచ్చారు. ఇందుకుగాను మల్లయ్య కు రూ.7.50 లక్షలు, బద్రికి రూ.2.50 లక్షల జరిమానా విధించారు.

ఈ తీర్పుతో తీవ్రమనస్తాపం చెందిన మల్లయ్య భార్య పద్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...