Friday, January 28, 2022

Fun day: విజయ్ దేవరకొండ ‘లైగర్’లో బాక్సింగ్ హీరో.. ఆశ‌గా ఎదురుచూస్తున్న సినీ ల‌వ‌ర్స్‌..


మైక్ టైసన్.. అనగానే బాక్సింగ్ రింగ్‌లో పదునైన పిడిగుద్దులతో ప్రత్యర్థిని కుప్పకూల్చే మహాబలుని రూపం అందరికీ యాదికి వ‌స్తుంది. కోపంతో ఊగిపోతూ ఎదుటివారికి ముచ్చెమటలు పట్టించడం, బౌట్‌లో కనికరం లేకుండా ఎదురుదాడి చేయడం, గెలవడం కోసం చివరకు ప్రత్యర్థి చెవిని తెగేలా కొరకడం లాంటి పనులన్నీ ఒక్కొక్కటిగా మ‌న కళ్ల ముందు మెదులుతాయి. ఇవన్నీ 1980, 90 దశకాల్లో క్రీడాభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటనలు. ఆ సమయంలో బాక్సింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు మైక్ టైసన్. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో 20 ఏళ్ల వయస్సులోనే డబ్ల్యూబీసీ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఏకైక బాక్సర్ మైక్ టైస‌న్ ఒక్క‌డే.

ఒకే సమయంలో ఆయన వద్ద వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్, వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ టైటిళ్లు ఉన్నాయంటే రింగ్‌లో ఆయనెంత పవర్‌ఫుల్ బాక్సరో అర్థం చేసుకోవచ్చు. త‌న కెరీర్‌లో ఆడిన 58 మ్యాచ్‌ల్లో 50 సార్లు విజయం ఆయననే వరించింది. బాక్సింగ్ రింగ్‌ను ఆయన ఎంతలా ఏలారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. అందులో 44 మ్యాచ్‌ల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరింత విశేషం.

ఇక‌పోతే.. ఐరన్ మ్యాన్, కిడ్ డైనమేట్, ‘ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్’ అని టైస‌న్‌కు ముద్దుపేర్లే ఆయన వైఖరి ఎలాంటిదో తెలుపుతాయి. చిన్నతనంలో ఎప్పుడూ గొడవలు, చోరీ కేసుల్లో జైలుకు వెళ్లిన కుర్రాడు… తర్వాత తన కసి, పట్టుదలతో బాక్సింగ్ ప్రపంచానికి రారాజయ్యాడు. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో టైసన్ బాల్యమంతా గందరగోళంగా గడిచింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఇంట్లో గొడవలతో మొండిగా తయారైన త‌ను ఎఫ్పుడూ వీధి గొడవల్లో తలదూర్చేవాడు. ప్రతీ చిన్న విషయానికి విపరీతమైన కోపం తెచ్చుకునేవాడు. దీంతో అనవసర తగాదాలకు పోయి అందరిలో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.

అదే సమయంలో ‘కస్ డి అమాటో’ అనే ట్రైనర్ టైసన్‌ను చేరదీసి బాక్సింగ్‌లో రాటుదేలేలా తయారు చేశారు. అతనికి బతకడం ఎలాగో నేర్పించాడు. మాజీ చాంపియన్ ఫ్లాయిడ్ ప్యాటర్సన్‌ కెరీర్ ఎదుగుదలలో కూడా కస్ డి అమాటో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ప్రతీ దశలోనూ టైసన్ వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నాడు. సమస్య ఎదుర్కొన్న ప్రతీసారి కోపాన్నంతా బాక్సింగ్‌లో చూపించేవాడు. కారణాలేవైనా ఆయన ఇద్దరు భార్యలతో విడిపోయాడు. ప్రత్యర్థుల కుట్రలతో అత్యాచార కేసులో నిందితునిగా జైలు శిక్ష అనుభవించాడు. లెక్కలేనన్ని డబ్బులు సంపాదించి చివరకు పేదరికాన్ని కూడా అనుభవించాడు. ఒకానొక దశలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. ఆకాశానికి ఎక్కినట్లే ఎక్కి అంతలోనే అథ:పాతాళానికి దిగజారేవాడు. ఇలా టైసన్ జీవితమంతా సమస్యలమయం.

బాక్సింగ్‌లో ఎవరూ సాధించలేని రికార్డులు నెలకొల్పిన అతను, డ్రగ్స్ వ్యాపారం కూడా చేశాడు. రైటర్మెంట్ అనంతరం హాలీవుడ్‌ హిట్ సినిమాల్లో నటించి ఆయన ఈ తరం యువతకు కూడా పరిచయమయ్యారు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో క్రీడాభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు కూడా ఆయన చేరువ కానున్నాడు.

Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....