Friday, January 28, 2022

Konijeti Rosaiah No more: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు | former chief minister konijeti rosaiah no more


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.. కన్నుమూశారు. నిద్రలోనే ఆయనకు గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం విడిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. నిద్రలోనే ఆయనకు గుండెపోటు రాగా.. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. అంతలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. రాజకీయ చాణక్యుడిగా పేరు గాంచిన రోశయ్య.. శాసనమండలి సభ్యుడిగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఆర్థిక మంత్రిగా.. ముఖ్యమంత్రిగా అసమాన రీతిలో ప్రజలకు సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ కష్ట కాలంలో ఉన్న సమయాల్లో.. ముందుండి సమస్యలు ఎదుర్కొన్నారు.

ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన రోశయ్య.. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థంగా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గానూ పని చేశారు. పేరుకు కాంగ్రెస్ నేత అయినా.. రోశయ్యకు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. ఆయా పార్టీల నేతలంతా.. రోశయ్య మరణంపై తీవ్ర ఆవేదన, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రేపు మధ్యాహ్నం రోశయ్యకు హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి మృతిపై.. 3 రోజుల పాటు సంతాపదినాలుగా వ్యవహరించనున్నట్టు తెలిపింది.

  • కాసేపట్లో రోశయ్య నివాసానికి.. చీఫ్ జస్టిస్

    మరికొద్ది సేపట్లో రోశయ్య ఇంటికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV రమణ చేరుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రి భౌతిక కాయానికి ఆయన నివాళి అర్పిస్తారు.

  • తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. రాజకీయాల్లో రోశయ్య తనదైన శైలిని ప్రదర్శించేవారని పేర్కొన్నారు. పలు పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఆయన మృతి చాలా బాధాకరమని సీఎం అన్నారు.

  • లాంఛనాలతో అంత్యక్రియలు.. 3 రోజులు సంతాపదినాలు

    మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో జరపాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే.. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • రఘువీరారెడ్డి కంటతడి

    మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణవార్త విని ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి కంటతడి పెట్టారు. రోశయ్య లేని కౌన్సిల్ ను చూడలేకపోయామని ఆయన గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలకు హాజరవుతానని చెప్పారు.

  • ప్రజల మనిషి దూరమవడం బాధాకరం

    మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య మృతిపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల మనిషి దూరం కావడం బాధాకరమని చెప్పారు.

  • గవర్నర్ తమిళిసై సంతాపం

    మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి.. గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన గవర్నర్.. రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించారు.

  • అంత్యక్రియలు ఎక్కడ అన్నది.. రోశయ్య కుటుంబీకుల ఇష్టం

    రోశయ్య మృతి.. తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ఆవేదన చెందారు. తన గురువు ఇక లేరన్నది జీర్ణించుకోలేకపోతున్నట్టు టెన్ టీవీతో చెప్పారు. హైదరాబాద్ కు వెళ్లి రోశయ్య పార్థివ దేహానికి నివాళి అర్పిస్తానని.. అంత్యక్రియల విషయమై ఆయన కుటుంబీకులతో మాట్లాడతానని తెలిపారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలన్నది.. రోశయ్య కుటుంబీకుల ఇష్టంగా చెప్పారు. తమ ప్రభుత్వం.. రోశయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

  • విశాఖ నుంచి బయల్దేరిన రోశయ్య కుమార్తె

    మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కుమార్తె విశాఖ నుంచి బయల్దేరారు. రేపు మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో రోశయ్యకు అంత్యక్రియలు జరగనున్నాయి.

  • సాయంత్రం హైదరాబాద్ కు చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి ఆయన నివాళి అర్పిస్తారు.

  • రోశయ్య మృతిపై సంతాపాల వెల్లువ

    Konijeti Rosaiah: రోశయ్య మృతిపై.. సంతాపాల వెల్లువ

  • నివాసానికి రోశయ్య పార్థివదేహం తరలింపు

    మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థివదేహాన్ని.. ఆయన స్వగృహానికి తరలించారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

  • కాసేపట్లో ఆస్పత్రి నుంచి ఇంటికి రోశయ్య పార్థివదేహం తరలింపు

    స్టార్ హాస్పిటల్ నుంచి.. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థివ దేహాన్ని అమీర్ పేటలోని స్వగృహానికి తరలించనున్నారు. అక్కడ ఇప్పటికే పార్థివ దేహాన్ని ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

  • రోశయ్య మృతిపై చంద్రబాబు సంతాపం

    మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. రోశయ్య మృతి బాధాకరమని, రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా ఖ్యాతి గడించారని అన్నారు. విద్యార్థి సంఘ నాయకుడుగా కెరీర్ మొదలుపెట్టి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా రోశయ్య ఎదిగారని వెల్లడించారు రోశయ్య.

  • రోశయ్య మృతిపై సోనియా సంతాపం

    మాజీ సీఎం రోశయ్య మృతిపై.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. అవకాశం ఉంటే.. రేపు హైదరాబాద్ వచ్చి.. రోశయ్య పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు ప్రయత్నిస్తానని సోనియా తెలిపినట్టు.. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ చెప్పారు.

  • బడ్జెట్ కూర్పులో ఘనాపాటి.. రోశయ్య

    సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పనిచేశారు రోశయ్య. అందులో నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు రోశయ్య. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఎకైక వ్యక్తిగా రోశయ్య పేరిట రికార్డు ఉంది. బడ్జెట్ కూర్పులో ఘనాపాటిగా పేరున్న రోశయ్య.. సుదీర్ఘ కాలంపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో ఆయనకు ఆయనే సాటి.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...