Friday, January 28, 2022

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో 9 ప్రాంతాల్లో ప్రమాదకర కొండచరియలు | Tirumala Ghat Road, Dangerous Landslides In 9 Places

తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో చెన్నై, ఢిల్లీ ఐఐటీ నిపుణుల పరిశీలన చేశారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంపై అధ్యయనం

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో చెన్నై, ఢిల్లీ ఐఐటీ నిపుణుల పరిశీలన చేశారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంపై అధ్యయనం కోసం ఢిల్లీ ఐఐటీ నిపుణులను టీటీడీ ఆహ్వానించింది. రెండు రోజుల పాటు కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ నిపుణులు ప్రొఫెసర్ కేఎస్.రావు పరిశీలించారు. ఘాట్ రోడ్డులో 9 ప్రాంతాల్లో ప్రమాదకర కొండ చరియలు ఉన్నట్లు ఐఐటీ నిపుణులు గుర్తించారు.

ఇప్పుడు విరిగిపడ్డ కొండచరియ పక్కనే కూలడానికి సిద్ధంగా ఉన్న కొండచరియపట్ల టీటీడీ ఇంజనీరింగ్ ఆధికారులు ఆందోళన చెందుతున్నారు. కొండ చరియను కూల్చేయడానికి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఘాట్ రోడ్ల ఏర్పాటు, కొండచరియల తొలగింపులో అనుభవమున్న ఆఫ్ కాన్ సంస్థకు ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు అప్పగించారు.

Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?

తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ఆప్కాన్ సంస్థ నిర్మిస్తోంది. కొండచరియ కూల్చే సమయంలో ఎవరికీ ప్రమాదం లేకుండా, రోడ్డు పాడవకుండా కెమికల్ టెక్నాలజీతో కొండచరియను పైనే పగులగొట్టాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న కొండచరియలను వెంటనే తొలగించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. రెండవ ఘాట్ రోడ్ లో లింక్ రోడ్డు వరకు ఉన్న అడ్డంకులు తొలగించి శనివారం ఉదయం నుండి వాహనాలను తిరుమలకు అనుమతించారు.

Lemon Juice : వేడి నీటితో నిమ్మరసం…ఆరోగ్యానికి మంచిదా?

రెండవ ఘాట్ రోడ్ లోని భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో కొండచరియల తొలగింపు, రోడ్డు నిర్మాణం పనులను నెల రోజుల్లో పూర్తి చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంది. కేరళలోని మాతా అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సహాయం టీటీడీ తీసుకోనుంది.
నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ కలిసి హిమాలయ పర్వతాలు, పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడడం, పునరుద్ధరణ చర్యలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా టీటీడీకి వివరించారు.

Related Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

Latest Articles

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...