Sunday, January 16, 2022

Zodiac Signs : డిసెంబర్ 5 ఆదివారం ఈరాశి వారికి ఈరోజు శుభవార్త‌లు వింటారు..! | The Telugu News


మేషరాశి ఫలాలు : ఈరోజు సమాజంలో మీకు పరపతి పెరుగుతుంది. అనుకోని వస్తువులను కొనుగోలు చేస్తారు. లాభాలు, సంతోషం, వ్యాపారాలు కొత్త ఆశలు. అనుకూలమైన ఫలితాల కోసం విష్ణు ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. పనులను వేగంగా, సంపూర్ణంగా పూర్తిచేస్తారు. అనుకోని అతిథుల రాకతో సందడి. వాహనాలను కొనుగోలకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్నింటా జయం. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఈ రోజు ఆటంకాలతో విసుగు వస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ధన విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో స్వల్ప సమస్యలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. పనులు నిదానంగా సాగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వీలైతే దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. చేసే పనులలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇంటా, బయటా బాధ్యతలు పెరుగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీ దుర్గాదేవి స్తోత్రం చదవండి.

Today horoscope december 5 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతోషం నిండిన రోజు. వ్యాపారాలు, ధన విషయం అన్నింటా మంచి ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా వసూలు కాని ధనం వసూలు అవుతుంది. వ్యవహారాలలో పురోగతి. మంచి ఫలితాల కోసం శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. అనుకోని చెడు వార్తలు వినాల్సి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. మనస్సు స్థిరంగా ఉండదు. కుటుంబంలో ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు సంతోషంతో కూడిన రోజు. పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విహార యాత్రలు లేదా క్షేత్ర సందర్శనకు ఆస్కారం ఉంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మంచి ఫలితాల కోసం శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆటంకాలతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో అనుకోని మార్పులు, వివాదాలకు ఆస్కారం ఉంది. సోదరులతో విభేదాలు రావచ్చు. ఇంటా, బయటా మాట తూలకుండా ఉండాలి. రుణాలు చేస్తారు. శుభ ఫలితాల కోసం శ్రీ కాలభైరవాష్టకం పారాయణం లేదా దగ్గరలోని దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు శుభవార్త శ్రవణం. నిరుద్యోగులకు మంచి వార్తలు అందుతాయి. అన్నింటా జయం. ఆర్థిక పురోగమనం. చిల్లర, కిరాణ, పాల వ్యాపారులకు మంచి రోజు.
పెద్దలతో చేసే చర్చలు సఫలం. శుభ ఫలితాల కోసం శివారాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని వారి నుంచి సహాయ సహకారాలు లభించి మంచి స్థితికి వెళ్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. క్షేత్రాలు సందర్శిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు కానీ పెద్దల సహకారంతో వాటిని అధిగమిస్తారు. శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో, కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ధనాభివృద్ధి, కొన్ని చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటిని అధిగమిస్తారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండండి. అనుకోని మార్పులతో మీరు కలత చెందుతారు. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన లేమి. దూరప్రయాణాలు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ పని చేసుకుంటూ పోవాలి తప్ప ఎవరిని విమర్శించకూడదు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...