Wednesday, January 26, 2022

Tiruchanoor Brahmotsavam 2021: గజ వాహనంపై శ్రీమహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు | Tiruchanoor Brahmotsavam 2021

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ‌మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌ గ‌ల వాహ‌న మండ

Tiruchanoor Brahmotsavam 2021 :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గజ వాహనంపై శ్రీ‌మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌ గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.
Also Read : Amaravathi Farmers : 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ.. అనుమతి కోరిన అమరావతి రైతులు
ఈరోజు సాయంత్రం జరిగిన వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గోన్నారు.

కాగా…… ముంబైకి చెందిన శంకర్ నారాయణ అనే భక్తుడు శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను ఆలయంలో అధికారులకు అందజేశారు.

Related Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

Latest Articles

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...