Friday, January 28, 2022

Former CM Rosaiah : రోశయ్య – వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న బంధం ప్రత్యేకమైంది | The bond between Konijeti Rosaiah and YS Rajasekhara Reddy is .special


రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి. వైఎస్ఆర్‌ 1999లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు….

Konijeti Rosaiah And YS Rajasekhara Reddy : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. రోశయ్య వయసు 88 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2009లో రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వహించారు. వయసు పైబడడంతో కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయన ఆర్థికమంత్రిగా చెరగని ముద్రవేశారు. సీనియర్ శాసనసభ్యునిగా ఉమ్మడి సభలో ఆయనంటే ప్రత్యేక గౌరవం ఉండేది. నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఆయన ఆర్థికమంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థికమంత్రిగా ఉంటూనే అన్ని విషయాల్లో వైఎస్‌కు చేదోడువాదోడుగా నిలిచారు.

Read More : Pawan Kalyan Mourned : రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు : పవన్ కళ్యాణ్

రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి. వైఎస్ఆర్‌ 1999లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు శాసనసభలో వీరిరువురూ ప్రధాన పక్షాన్ని ఇరుకున పెట్టే వారు. 2004లో వైఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన రోశయ్య… వైఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు చేపట్టి శాసనసభలో నెంబర్ 2గా వ్యవహరించారు. 2009లో రోశయ్య తాను ఇక శాసన సభకు పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పిన మరుక్షణం రోశయ్య చేత మంత్రి పదవికి శాసనసభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాధించాక రోశయ్యను వైఎస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు.

Read More : KVP on Rosaiah: రోశయ్య నుంచి వైఎస్ఆర్ చాలా విషయాలు నేర్చుకున్నారు

వైఎస్‌ మరణానతరం అధిష్టానం ఆదేశాలమేరకు అనూహ్యమైన పరిణామాలతో ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులైనా అనేక ఇబ్బందుల మధ్యనే ఆ పదవిలో కొనసాగారు. చివరికి అధిష్టానం ముఖమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంతో 2011 ఆగస్టు 31న తమిళ నాడు గవర్నర్ గా వెళ్ళారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలై నరెంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను అనేక చోట్ల తొలగించి వేరే వారిని నియమిస్తే తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ వ్యక్తి అయిన రోశయ్యను మాత్రం తొలగించకుండా కొనసాగించారు. దీనికి ప్రధాన కారణం వివాద రహితంగా తమిళనాడులో పేరు తెచ్చుకోవడమే. 2016లో తమిళనాడు గవర్నర్ గా పదవి విరమణ చేశారు.

Related Articles

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...