Saturday, January 22, 2022

Akhanda collections : ‘బాలయ్య’ నట విశ్వరూపం.. ‘అఖండ’ మెరుపులు అభిమానుల అరుపులు.. తొలిరోజే భారీ కలెక్షన్స్..! | The Telugu News

Akhanda collections : నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ మూవీతో మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా హిట్ టాక్ రావడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. థియేటర్ల వద్ద ఈలలు, గోలలు తప్పా ఏం వినిపించడం లేదు. బాలయ్యలో ఇన్నిరోజులు దాగియున్న పవర్ హౌజ్‌ను బోయపాటి శ్రీను బయటకు తీశారంటూ ఫుల్లు ఏంజాయ్ చేస్తున్నారు. ఇదే మా బాలయ్య అంటూ రోడ్ల మీద కూడా ఫ్యాన్స్ ‘జై బాలయ్య జైజై బాలయ్య’ అంటూ కేకలు పెట్టుకుంటూ పోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ‘అఖండ మూవీ’ ఏ రేంజ్‌లో ఉందో..

బోయపాటి శ్రీనుతో బాలయ్య చేసిన మూడో సినిమా ‘అఖండ’ మూవీ మార్నింగ్ షోతేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎట్టకేలకు దర్శకుడు శ్రీను, బాలయ్య బాబుకు హ్యాట్రిక్ పడిందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బోయపాటి బాలకృష్ణతో ఇంతకు ముందు తీసిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘అఖండ’తో మరో హిట్ పడటంతో వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్‌గా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత నందమూరి ఫ్యాన్స్ అఖండ అద్భుత విజయాన్ని తెగ ఏంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజే కలెక్షన్ల వరద పారించడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి తిరుగుతున్నారట..

akhanda Movie creates new record in collections

Akhanda collections : మాస్ మహారాజ్ బాలయ్య.. పారుతున్న కలెక్షన్ల వరద

తొలి షోతోనే హిట్ టాక్ రావడంతో నెమ్మదిగా సినిమాకు ఆడియెన్స్ క్యూ కట్టారట.. దీంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల తొలి రోజే అఖండ మూవీకి రూ. 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ కలెక్షన్లు వచ్చాయి. విడివిడిగా చూసుకుంటే నైజాం- 4.39 కోట్లు, సీడెడ్- 4.02 కోట్లు, ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు, ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు, వెస్ట్ గోదావరి- 96 లక్షలు, గుంటూరు- 1.87 కోట్లు, కృష్ణా- 81 లక్షలు, నెల్లూరు- 93 లక్షలుగా ఉన్నాయి.ఇక అఖండ సినిమా విడుదలకు ముందే రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు భారీగా పెరుగుతాయని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...