Sunday, January 23, 2022

Pawan kalyan : పవన్ కల్యాణ్ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. 2024 ఎన్నికల్లో అసలు జనసేన పార్టీయే డౌట్..! | The Telugu News


pawan kalyan : ప్రముఖ జ్యోతిష్యుడు ‘వేణుస్వామి’ సామాజిక మాధ్యమాల్లో గడిపేవారికి సుపరిచితమే. ప్రముఖుల జాతకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉంటారు. ఇప్పటికే అనేక మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి వేణుస్వామి సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఈయన చెప్పేవాటిని అంతా కొట్టి పారేస్తూ వెళ్ళినా…ఇటీవల ఆయన చెప్పే వాటిలో 90 శాతం వరకు నిజం అవుతుండటంతో ఆయనపై ఫోకస్ పెరిగింది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్నాయి.వేణుస్వామి తాజా వ్యాఖ్యలు పవన్ హార్డ్ కోర్ అభిమానుల్లో అలజడి రేపుతున్నాయి.

pawan kalyan : పవన్ 2024 వరకు రాజకీయాల్లో ఉండరు:

venu swami sensational comments on pawan kalyan over his political career

ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో… 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. దాంతో పాటు మరో అడుగు ముందుకేసి…. పవన్ కళ్యాణ్ ఒకదానిపై నిలకడగా ఉండరని అంటూ అదే అందుకు కారణమని చెప్పుకొచ్చారు. జనసే పార్టీ 2024 నాటికి ఉండదని బల్ల గుద్దినట్లు చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలను మెజారిటీ వర్గం కొట్టి పారేస్తున్నా.. కొద్దో గొప్పో ఆయనను నమ్మే వారూ ఉన్నారు. అందుకు కారణాలు లేకపోలేదు.వేణుస్వామి నాగచైతన్య సమంత విడాకుల విషయం గురించి మూడేళ్ల క్రితమే కామెంట్స్ చేసారు. అయితే ఆయన చెప్పిన దాన్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఇటీవల ఆయన జ్యోతిష్యం నిజమేనని నిరూపణ అయ్యింది.  అఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా వేణుస్వామి చెప్పిన కొద్ది  చెప్పినట్లు క్యాన్సిల్ అయింది.

pawan kalyan: 2024 ఎన్నికల్లోనూ జగన్ దే గెలుపు:

వేణుస్వామి ఇటీవల ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. 2022 ఏప్రియల్‌ 2 నుంచి సీఎం జగన్‌ జాతకంలో బుధమహర్దశ ప్రారంభం కానుందన్న వేణు స్వామి.. ఆ తర్వాత ఆయన దాదాపు 17 సంవత్సరాలు సీఎంగా చేస్తారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ జగన్ దే విజయమని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి, వేణుస్వామి చెప్పినట్టే 2024 లో జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందా.. ఆయన చెప్పిన జగన్ జాతకం ఎంత వరకు ఫలిస్తుందో తేలాలంటే 2024 వరకు వేచి ఉండాల్సిందే.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...