Friday, January 28, 2022

Tirumala Ghat Road: ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు.. నేడు తిరుమలకు ఢిల్లీ ఐఐటీ టీమ్! | Tirumala ghat Road Damaged due to massive landslide

తిరుమల రెండవ ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతం వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.

Tirumala Ghat Road: తిరుమల రెండవ ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతం వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఘాట్‌రోడ్డులో ఎక్కువ భాగం ధ్వంసం కావడంతో.. దీన్ని పునరుద్ధరించేందుకు మరో మూడురోజులు పట్టొచ్చని చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఒకే ఘాట్‌ రోడ్ మీదుగా తిరుమల-తిరుపతికి రాకపోకలు జరగుతున్నాయి.

ఈ క్రమంలోనే తిరుమలకు ప్రయాణం పెట్టుకున్న భక్తులు కనీసం పదిహేను రోజుల పాటు వాయిదా వేసుకోవాలని కోరారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చెన్నై ఐఐటీ టీమ్‌ ఘాట్‌రోడ్‌ను పరిశీలించగా.. ఇవాళ ఢిల్లీ ఐఐటీ బృందం తిరుమలకు వచ్చిన ఘాట్ రోడ్డును పరిశీలించనుంది.

Omicron: 26దేశాలకు ఒమిక్రాన్.. అమెరికాలో తొలి కేసు.. భారత్‌లోనూ భయం భయం!

నవంబరులో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే ఘాట్‌రోడ్డులోని 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే దారిలో పలుచోట్ల రోడ్డు కుంగిపోయింది. ఐఐటీ నిపుణులు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఘాట్‌రోడ్డులో మరమ్మతులు చేస్తుండగానే నిన్న ఉదయం 16వ కిలోమీటర్‌ వద్ద ఓ భారీ కొండచరియ విరిగిపడింది.

Reliance JIO: వొడాఫోన్ ఐడియాపై రిలయన్స్ జియో కంప్లైంట్

మూడు రోడ్లపై దొర్లుకుంటూ 14వ కిలోమీటర్ వద్ద ఉన్న రోడ్డుపై పడింది. కొండ చెరియలు విరిగిపడుతున్న సమయంలో ఓ ఆర్టీసీ బస్సు అక్కడికి చేరుకోగా డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

మరమ్మతుల కారణంగా ఎగువ ఘాట్‌రోడ్డును తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఢిల్లీ ఐఐటీ టీమ్‌ అధ్యయనం చేశాక.. ఘాట్‌రోడ్‌ పటిష్టానికి చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Related Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

Latest Articles

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...