Friday, January 28, 2022

Akhanda Movie : బాలయ్య బాబుకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో అఖండ సినిమా..! | The Telugu News

Akhanda Movie : ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమను చిక్కుల్లో పడేసింది. ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లను చాలా వ‌ర‌కు త‌గ్గించేస్తూ ఆ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీకి పెద్ద శాపంగా మారింది. అసలే కరోనా పుణ్యమా అని నష్టాల్లో కూరుకు పోయిన చిత్ర పరిశ్రమకు… ఈ నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించక పోవడమే ఇందుకు నిదర్శనం.

Akhanda Movie : 20 ఏళ్ల క్రితం ధరలు, రోజుకు నాలుగే ఆటలు

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. నేడు ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని ఏ ఏ న‌గ‌రాల్లో, ఏ థియేటర్ల‌లో టిక్కెట్ ధర ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జీవో ఒకటి విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం… హైయ్యేస్ట్ టిక్కెట్ రేట్ 240 రూపాయలు మాత్ర‌మే. ఇలా 20 ఏళ్ల క్రితం ఉన్న రేట్లతో ప్రస్తుతం షోలను నడిపించాలని  నిర్ణయించడంతో పాటు మరో బాంబుు పేల్చింది. ఇక నుంచి పెద్ద సినిమాలకు సైతం బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ షోలు ఉండవని స్పష్టం చేసింది. ఏ సినిమా అయినా రోజుకు 4 ఆట‌లు మించి వేయ‌కూడ‌ద‌న్న కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది.

Ap Govt Shock to Balakrishna Akhanda Movie ticket rates

Akhanda Movie : చిక్కుల్లో బాలయ్య బాబు సినిమా..!

ఈ తాజా నిర్ణయం బాలయ్యని చిక్కుల్లో పడేసేలా చేసింది. బాలకృష్ణ ఎంతో ఇష్టంగా పూర్తిచేసిన అఖండ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. ఒక వేళ ఈ మంచి టాక్ వ‌చ్చినా… ఏపీలో అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు రాక‌పోతే నష్టాల బాటలో నడవక తప్పదని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడా నిర్మాతలు అంతా…. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో తాము పూర్తిగా నష్ట పోతామంటూ ఓటీటీ వైపు అడుగులు వేసే ప్రయత్నాల్లో పడ్డట్లు తెలుస్తోంది. క‌రోనా రెండో దశ అనంతరం థియేట‌ర్లో విడుదల అయిన పలు చిన్న చిత్రాలు ఓ మోస్తరుగా ఆడాయి. గత కొన్ని నెలలుగా రిలీజ్ అయిన సినిమాలలో పోలిస్తే…తాజాగా విడుదల అవుతున్న పెద్ద సినిమా అఖండ. టాక్ ఎలా ఉన్నా… కమర్షియల్ గా హిట్ అవుతుందా లేదా అనేది చెప్పాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Related Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

Latest Articles

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...