Friday, January 28, 2022

Realtor Murder Case : తిరుమలగిరి రియల్టర్ మర్డర్ కేసు నిందితుడు అరెస్ట్ | Realtor Murder Case

సికింద్రాబాద్ తిరుమలగిరి రియల్టర్ విజయభాస్కర్ రెడ్డిని వారి బంధువు తోట నరేందర్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

Realtor Murder Case :  సికింద్రాబాద్ తిరుమలగిరి రియల్టర్ విజయభాస్కర్ రెడ్డిని వారి బంధువు తోట నరేందర్ రెడ్డే హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. నిందితుడు నరేందర్‌రెడ్డిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నరేందర్ రెడ్డి నాటు తుపాకీతో విజయభాస్కర్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి వద్దనుంచి రెండు తుపాకులతో పాటు  2 రౌండ్స్ లైవ్ బుల్లెట్స్, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ తిరుమలగిరిలో రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి సోమవారం హత్యకు గురయ్యాడు. పెద్ద కబేళాలోని ఆర్మీకి సంబంధించిన బహిరంగ ప్రదేశంలో ఓ కారులో చనిపోయి ఉన్నాడు. సోమవారం రాత్రి కారులో మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. విజయభాస్కర్‌‌ది అనుమానాస్పద మృతిగా మొదటగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు కొనసాగించారు. కానీ తలపై బుల్లెట్ గాయం ఉండటం…కుటుంబ సభ్యులు అనుమానాలతో, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
Also Read : Tirumala Ghat Road : కొండచరియలు విరిగి పడటంతో భారీగా దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు
కుటుంబ సభ్యులు ఇచ్చిన అనుమానితులలో మృతుని బంధువు తోట నరేందర్‌ రెడ్డితో పాటు మరో వ్యక్తి అబ్రహాంపై అనుమానాలు వ్యక్తం అవటంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా ఆర్ధిక లావాదేవీల్లో వచ్చిన తేడాలవల్లే విజయభాస్కర్ రెడ్డిని హత్య చేసినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయటంతో నరేందర్ ఈహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

Related Articles

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

Latest Articles

‘గుడ్ లక్ సఖి’ మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?

Good Luck Sakhi Sports Drama దర్శకుడు: Nagesh Kukunoor Artist: Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others సినిమా రివ్యూ:...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...