Friday, January 21, 2022

Tandur : రోడ్లు బాగు చేయించండి అంటూ టీఆర్ఎస్ కార్యకర్త పొర్లుదండాలు | TRS Leader Protest In Tandur Constituency Antaram Village :

కంకర తేలిన రోడ్డుపై పొర్లుదండాలు పెట్టాడు. అతను అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త కావడం విశేషం.

TRS Leader Protest : సార్ రోడ్లు బాగు చేయించండి..కాలుష్యాన్ని అరికట్టండి అంటూ ఎంత చెప్పినా..అధికారులు పెడచెవిన పెడుతుండడంతో..ఓ వ్యక్తికి కోపం వచ్చింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. అందరిలాగా కాకుండా..వెరైటీగా తెలియచేశాడు. కంకర తేలిన రోడ్డుపై పొర్లుదండాలు పెట్టాడు. అతను అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త కావడం విశేషం. పొర్లుదండాలు పెడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది.

Read More : Farmer Protests: రైతుల నిరసనల్లో ఒక్కరూ మరణించలేదా? కేంద్రం ఏం చెబుతోంది?

తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అంతారం అనుబంధ గ్రామంలోని దస్తగిరిపేట గ్రామంలో బొయిని అంబ్రేష్ ముదిరాజ్ నివాసం ఉంటున్నారు. ఇతను టీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త. గ్రామంలో రోడ్లు బాగా లేక కంకర తేలి కనిపిస్తోంది. దీంతో తన నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతారం నుంచి పొర్లుదండాలు పెడుతూ ముందుకు సాగాడు. ముందు మొకాళ్ల‌పై న‌డిచిన అంబ్రేష్…కొద్ది దూరం త‌రువాత‌ కంక‌ర రోడ్డుపైనే పొర్లుతూ మార్గ‌మ‌ద్య‌లోని టీఆర్సీ క్ల‌బ్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకుని అంబ్రేష్ ను అడ్డుకున్నారు. పీఎస్ కు తరలించారు. తాండూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని పోలీసులకు తెలిపాడు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు స్పందించి రోడ్లు బాగుచేయాల‌నే ఉద్దేశంతో నిర‌స‌న చేప‌ట్టిన‌ట్లు అంబ్రేష్ తెలిపారు.

Read More : TTD : తిరుపతి యాత్రను 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలి

దీంతో పాటు ప‌ట్ట‌ణంలో విప‌రీతంగా పెరిగిన కాలుష్యంపై ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, కాలుష్యాన్ని నియంత్రించాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌భుత్వానికి పొర్లుదండాలు పెట్టిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండ‌గా తాండూరులో తిష్ట‌వేసిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సామ‌న్యులు నిర‌స‌న‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారుతున్నాయి. మరోవైపు…ఇటీవలే అంతారం గ్రామానికి చెందిన రిజ్వాన్ అనే వ్య‌క్తి తాండూరు అభివృద్ధి దిగ‌జారిపోవ‌డానికి కార‌ణం నేనే అంటూ మెడ‌లో చెప్పుల దండ వేసుకుని.. చెత్త ఓట‌ర్‌ను నేను.. న‌న్ను చెప్పుతో కొట్టండి అంటూ నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా…అంబ్రేష్ చేసిన వినూత్న నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...