Wednesday, January 19, 2022

బిగ్ బాసోడి ఐస్ టాస్క్.. ఏంటి సార్ ఇది.. వ‌ణికిపోతున్న కంటెంస్టెంట్స్‌..


బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ కాస్త ఎమోష‌న్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. కంటెస్టెంట్స్ విషయంలో నెటిజన్లు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరని కామెంట్స్ వ‌స్తున్నాయి. కానీ, టాస్క్ ల విషయంలో మాత్రం నిర్వహకులు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక సీజన్ 5 ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుతున్న క్ర‌మంలో గేమ్‌ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. టాప్ కంటెస్టెంట్స్ లలో ఎవరు నిలుస్తారు.. అనే విషయంలో కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అతి ముఖ్యమైన టికెట్ టూ ఫినాలే లో ఎవరు పై చేయి సాధిస్తారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టికెట్ టూ ఫీనాలే..
బిగ్ బాస్ లో ఫైనలిస్ట్ కంటెస్టెంట్ గా ఎవరు నిలుస్తారో చెప్పడం చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా గ‌ట్టిగానే పోరాడుతున్నారు. కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ ముగ్గురు ఫైనల్స్ వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మిగతా వారిలో టికెట్ టూ ఫీనాలేకు ఎవరు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ కూడా పోటీ లో మెల్లగా డోస్ పెంచే చాన్స్‌ ఉన్నట్లు అర్ధమవుతోంది. ఫైనల్స్ కోసం చాలెంజ్ మూడు రకాల ఫ్లాగ్స్ తో పాటు మూడు విభిన్నమైన చాలేంజెస్ ను పెట్టిన బిగ్ బాస్ ఈ పోటీలో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ అందుకొని మొదటి స్థానంలో నిలుస్తారో వారు డైరెక్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్స్ వెళ‌తార‌ని ప్ర‌క‌టించారు. బిగ్ బాస్ మొదట ఎండ్యూరెన్స్ చాలెంజ్ లో భాగంగా పోటీదారులందరి కోసం ఐస్ తో నింపిన టబ్స్ ఉంచారు. చాలెంజ్ లో భాగంగా ఓర్పును చూపించాల్సి ఉంటుంది.

ఐస్ ఛాలెంజ్.. ఎక్కువసేపు ఐస్ టబ్ లోనే ఉండాలి. అంతే కాకుండా పక్కనే ఎవరి బాల్స్ ను వారు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యలో సన్నీ తన దొంగతనాన్ని చూపించాడు. అలాగే కాజల్ అతన్ని గుర్రుగా చూస్తూ కౌంటర్ ఇవ్వాలని అనుకుంటోంది. ఏంటి? చూస్తున్నావు అంటూ సన్నీ కూడా కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా కామెడిగా సార్ ఏంటి సార్ ఇది అంటూ ఐస్ దెబ్బకు వణికిపోయాడు. ఇక ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలి అంటే ఈరోజు ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ పై లుక్ వేయాల్సిందే.

ఆమె గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే..
ఇక ఈసారి ప్రియాంక ఫైనల్స్ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. మరోవైపు కాజల్ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. నాలుగు సీజన్స్ లోనూ అబ్బయిలు మాత్రమే గెలిచారు. ఈసారైనా అమ్మాయిలు టైటిల్ విన్నర్ గా నిలుస్తారా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పోటీగా మానస్, శ్రీరామ్, సన్నీ, షన్ను న‌లుగురు చాలా బలంగా పోరాడుతున్నారు. ఈ టాస్క్ లో ప్రియాంక గెలిస్తే చరిత్ర సృష్టించిన‌ట్టే.. గుర్తింపు కూడా దక్కుతుంది.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...