Sunday, January 23, 2022

Heavy Rains : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..పలు చోట్ల రాకపోకలు బంద్ | Heavy rains in Nellore district .. Traffic closed in many places

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 10.7 సెo.మీగా నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెo.మీ వర్షపాతం నమోదు అయింది.

Heavy rains in Nellore : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరి వర్షపాతం 10.7 సెo.మీగా నమోదైంది. అత్యధికంగా పొదలకూరు మండలంలో 20.2 సెo.మీ వర్షపాతం నమోదు అయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

చెరువులు నిండు కుండల మారుతున్నాయి. గూడూరులో పంబలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 20 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి.

VC Sajjanar : ఆర్టీసీ బస్సులో కుటుంబంతో కలిసి ప్రయాణించిన సజ్జనార్‌

చెన్నై, తిరుపతి నుండి నెల్లూరు వైపు వచ్చే వాహనాలను నాయుడుపేట నుండి వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, అయ్యప్ప సెంటర్ మీదుగా హైవేకు కలుపుతూ డైవర్షన్ చేశారు. నెల్లూరు నుండి తమిళనాడు వైపు, తిరుపతి వెళ్ళే వాహనదారులను కృష్ణపట్నంపోర్టు రోడ్డు వైపుకు వరగలి, కడివేడు, కోట క్రాస్ రోడ్డు మీదుగా హైవేకు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు.

గూడూరులో ఎటుచూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. కండలేరు జలాశయం నుంచి నీటి విడుదలకు తోడు భారీ వరదలతో జలమయంగా గూడూరు జలమయంగా మారింది. గూడూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

TSRTC : శబరిమల యాత్రకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఆ ఐదుగురికి ఉచిత ప్రయాణం

వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బ్రిడ్జి దగ్గర వన్‌వేలో ట్రాఫిక్‌ను పంపిస్తున్నారు. జాతీయ రహదారిపై పరిస్థితి నెల్లూరు ఎస్పీ విజయరావు పరిశీలించారు. వాహనదారుల్లో వృద్ధులు, పిల్లలు ఉంటే వారికి కావాల్సిన సాయం చేయాలని ఆదేశించారు.

Related Articles

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో. ప్రభాస్ చేసే సినిమాల మీద అంతర్జాతీయ స్థాయి నటీనటుల కన్ను ఉంటుంది. ప్రభాస్ సినిమాలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. అలాంటి ప్రభాస్ ...

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

ప్రధానాంశాలు:టాక్ షోతో దుమ్ములేపుతోన్న బాలకృష్ణముగుస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్మహేష్ బాబుపై బాలయ్య కామెంట్స్నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు...

Latest Articles

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ...