Wednesday, January 26, 2022

Laksha kumkumarchana : శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ల‌క్షకుంకుమార్చ‌న‌ | Laksha kumkumarchana

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో  రేపటి నుంచి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి. 

Laksha kumkumarchana :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో  రేపటి నుంచి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.  వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని ఈ రోజు ఉద‌యం గం.8ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న సేవ శాస్త్రోక్తంగా జ‌రిగింది.  ఈ సేవ‌లో వ‌ర్చువ‌ల్‌ విధానం ద్వారా 413 మంది గృహ‌స్తులు త‌మ ఇళ్ల నుండి పాల్గొన్నారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు.

కాగా, హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష‌ ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. ల‌క్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్షకుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.

Also Read : Heart Health : గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారాలు ఇవే…

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం మీడియాతో మాట్లాడుతూ, బ్ర‌హ్మోత్స‌వాల ముందురోజు ల‌క్షకుంకుమార్చ‌న సేవ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఈ ఉత్స‌వాలు దిగ్విజ‌యంగా జ‌ర‌గాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

కాగా….ఆలయంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుండి 10 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంట‌ల మధ్య పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

Related Articles

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

Latest Articles

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...