Friday, January 21, 2022

Anchor Ravi : బిగ్ బాస్ సెట్ ఎదుట రవి ఫ్యాన్స్ రచ్చ రచ్చ | The Telugu News

Anchor Ravi : బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టాప్ సెలబ్రిటీ హోదాలో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలో దిగిన యాంకర్ రవి… ఊహించని విధంగా 12వ వారం ముగిసే నాటికి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. రవి టాప్‌ 5లో ఉంటాడనుకున్న అభిమానులంతా.. అతడి ఎలిమినేషన్ వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రతివారం నామినేట్ అవుతున్నా.. అందరి కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకుని సేవ్ అవుతూ వచ్చిన తమ అభిమాన కంటెస్టెంట్ ను… అలా ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ అతడి అభిమానులు బిగ్ బాస్ యాజమాన్యంపై మండి పడుతున్నారు. రవికి కావాలనే అన్యాయం చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఏకంగా రవి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే అతడిని హౌస్ నుంచి పంపించారంటూ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

గత రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లోని బిగ్ బాస్ సెట్ ఎదుట… రవి ఎలిమినేషన్ ని తప్పు పడుతూ అతడి అభిమానులు ఆందోళన చేపట్టారు. రవి ఎలిమినేషన్ పక్కా అన్‌ఫెయిర్‌ అంటూ బిగ్‌బాస్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా సెట్ ఎదుట రచ్చ రచ్చ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలపాలని డిమాండ్ చేశారు. తోటి కంటెస్టెంట్ లు… ప్రియాంక, సిరి, కంటే రవికే ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. రవి లేని బిగ్ బాస్ ను తాము చూడమన్నారు. మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా రవిని హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Anchor Ravi fans fires on  Big Boss 5 Telugu team

 Anchor Ravi : సెట్ ఎదుట రవి అభిమానుల ఆందోళన

మరో వైపు సోషల్ మీడియాలో సైతం రవి ఎలిమినేషన్ పై పెద్ద చర్చ నడుస్తోంది. షణ్ముక్ గెలుపు కోసమే రవిని హౌస్ నుంచి బయటకి పంపించేశారంటూ బిగ్ బాస్ టీమ్ పై విరుచుకు పడుతున్నారు. గేమ్ బాగ్ ఆడుతున్న రవిని తీసేసి… సోఫాకే పరిమితమైన షణ్ముక్ ను గెలిపిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రవికి తక్కువ ఓట్లు వచ్చాయంటే ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరని అన్నారు. నామినేట్ అయిన వారిలో… ఓటింగ్ పరంగా చూస్తే రవి 3వ స్థానంలో ఉన్నారని అన్నారు. గత కొన్ని వారాలుగా రవి గ్రాఫ్ బాగా పెరుగుతూ వచ్చిందన్నారు. ప్రతీవారం నామినేట్ అవుతున్నా… ఒంటరిగా పోరాడుతూ.. మరింత స్ట్రాంగ్ అయ్యాడని అంటున్నారు. రవి కంటే వీక్ గా ఉన్న ఇతర కంటెస్టెంట్స్‌ను హౌస్ లో పెట్టుకుని.. గేమ్ బాగా ఆడుతున్న రవిని బయటిని పంపించడం దారుణం అంటున్నారు.

మరోవైపు హౌస్ నుంచి బయటకొచ్చిన రవి.. తన ఎలిమినేషన్‌పై రియాక్ట్ అయ్యారు. తాను ఎలిమినేషన్ అవుతానని అస్సలు ఊహించలేదని అన్నారు. గేమ్ బాగా ఆడినప్పటికీ ఎలిమినేట్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇంత మంది అభిమానం చూశాక… తానే గెలిచినట్లు భావించానని అన్నారు. తన ఎలిమినేషన్ విషయంలో తప్పు తీర్పు వచ్చిందని తన అభిమానులు నమ్ముతుండటం పట్ల తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...