Friday, January 21, 2022

Etela Rajender : ధనిక రాష్ట్రమంటున్న సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు : ఈటల | BJP MLA Etela Rajender criticized CM KCR

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

Etela Rajender criticized CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అసహనం మొత్తాన్ని రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుండి తెలంగాణ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుందన్నారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని.. దంపుడు బియ్యం వద్దని చెప్పిందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు.

Adilabad : చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పు పెట్టాడు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ముందే చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులను వినియోగించుకుని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...