Friday, January 21, 2022

Father : కన్న కొడుకుల దాష్టీకం.. జిల్లా కలెక్టర్‌కు రూ.2 కోట్ల ఆస్తి రాసిచ్చిన తండ్రి..! | The Telugu News

Father  : ప్రస్తుత సమాజంలో పిల్లలు తమ పేరెంట్స్‌ను పట్టించుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తిండి పెట్టకుంట వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఇంట్లోంచి గెంటివేస్తు్న్నారు. ఆస్తుల కోసం కన్న తల్లితండ్రులను, తోడబుట్టిన వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తుల కోసం ఏకంగా రక్త సంబంధీకులను సైతం చంపడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలకు సంబంధించిన విషయాలను మనం రోజూ వార్త కథనాలు, సోషల్ మీడియా ద్వారా చూస్తునే ఉంటాం. తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొడుకులతో విసిగిపోయిన ఓ తండ్రి రూ.2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ పేరిట రాసి షాకిచ్చాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఆగ్రాలోని నీరాలాబాద్‌ పీపల్‌‌మండికి చెందిన గణేశ్‌ శంకర్‌ పాండే (88)కు ఇద్దరు కుమారులు. ఈయన సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో తన సోదరులతో విడిపోయాక ఇతని వాటాగా 225 చదరపు గజాల స్థలం వచ్చింది. ప్రస్తుతం దీని విలువ రూ.2 కోట్లు.. అయితే, తండ్రి వద్ద ఉన్న ఆస్తి కోసం తన ఇద్దరు కుమారులు కొట్టుకోవడం ప్రారంభించారు. పెద్ద కుమారుడు దిగ్విజయ్‌ తండ్రికి చెందిన ఆస్తిలో తనకే అధిక భాగం రావాలని తరచూ గొడవ చేస్తుండేవాడు. శంకర్ పాండే ఎంత నచ్చజెప్పాలని చూసిన అతను వినేవాడు కాదు.దీంతో విసుగు చెందని పెద్దాయన షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.

father writes property worth rs 2 crore to district collector

Father  : కొడుకులను కాదని.. కలెక్టర్‌కు

పెద్ద కుమారుడి వద్దే ఉంటున్న శంకర్ పాండే కొడుకు పెట్టే టార్చర్ భరించలేక తిరిగి తన సోదరులు రఘునాథ్, అజయ్‌ల వద్దకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తనకు వాటాగా వచ్చిన 225 చదరపు గజాల భూమని జిల్లా కలెక్టర్ ఏకే సింగ్ పేరిట రాశారు. అందుకు సంబంధించి ఫార్మాలిటిస్ మొత్తం పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏకే సింగ్‌కు అప్పగించారు. దీంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. తన కుమారులకు బుద్ది చెప్పేందుకే ఇలా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు శంకర్ పాండే..

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...