Sunday, January 23, 2022

T.Congress : అందరం పీసీసీ ప్రెసిడెంట్లమే..నా రక్తంలో కాంగ్రెస్ ఉంది – కోమటిరెడ్డి | T.Congress Vari Deeksha


ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు 48 గంటల ‘వరి దీక్ష’…

Vari Deeksha : కాంగ్రెస్ లో అందరం పీసీసీ ప్రెసిడెంట్లమేనని, తన రక్తంలో కాంగ్రెస్ ఉందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు 48 గంటల ‘వరి దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసేందే. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శనివారం ప్రారంభమైన దీక్ష.. ఆదివారం రెండోరోజు ముగిసింది. ఈ సందర్భంగా..పలువురు నేతలు మాట్లాడారు. వరి వేస్తే ఉరి కాదు ప్రభుత్వాన్ని మొత్తం ఉరి వేస్తారని, మానవత్వం లేని ప్రభుత్వం పని ఖతం అయ్యిందన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. పదవులు ముఖ్యం కాదన్న ఆయన..తన రక్తంలోనే కాంగ్రెస్ ఉందన్నారు. టికెట్ల విషయంలో గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయని …ఇప్పుడు అలాంటి పొరపాట్లు జరగవన్నారు. వెయ్యిమందితో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తామని ఈ దీక్షకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామన్నారు.

Read More : Vari Deeksha : రేవంత్, కోమటిరెడ్డిలకు నిమ్మరసం ఇచ్చిన జానారెడ్డి

శ్రీధర్ బాబు : –

వరికి కనీస మద్దతు ధర ఇవ్వాలని, మార్కెట్ లు పెట్టి కొనుగోలు కేంద్రాలను దేశంలోనే మొదటి సారి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. రైతు వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్న వారంలోపు డబ్బులు చెల్లించారని, మిల్లింగ్ అయిన తరువాత FCIకి పంపించేదని, సోనియాగాంధీ నాయకత్వంలో 8 సార్లు మద్దతు ధర పెంచినట్లు…1300 రూపాయలు ఉన్న గ్రేడ్ ఏ కు 1500 ధర పెంచి సన్నారకాలను ప్రోత్సాహకాన్ని ఇచ్చామని గుర్తు చేశారు. 7 సంవత్సరాల బీజేపీ కాలంలో 2 సార్లు కనీస మద్దతు ధర పెంచి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.

Read More : Karnataka : రాష్ట్రాన్నే కుదిపేస్తున్న ఈవెంట్..కాలేజీలో 306 కరోనా కేసులు

ధర్నా చౌక్ ను ఎత్తేసిన సీఎం అదే ధర్నా చౌక్ లో ధర్నా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. గొనె సంచుల విషయంలో అవగాన లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారాయ. 20 రోజులుగా మార్కెట్ లో ధాన్యం కొంటలేరనే విషయాన్ని చెప్పారు. వర్షానికి తడిసి రంగు మారినా, మొలకలు వచ్చినా ఆ ధాన్యాన్ని తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇంకా 80 శాతం కొనుగోలు జరగలేదని, 2022లో వరి పంట వేయమని సంతకం చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రతిగింజా కొనుగోలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.

Read More : MSRTC : 6 వేల ఆర్టీసీ ఉద్యోగుల సస్పెండ్

జీవన్ రెడ్డి : –

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యంపై రైతులు ఆందోళన చెందుతున్నట్లు…కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కనీస మద్దతు ధర కల్పించిన ఘనత జాతీయ స్థాయిలో సోనియాగాంధీదేనని..గ్రామ స్థాయిలో వడ్ల కొనుగోలు కోసం ఐకెపిలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సభలో తెలిపారు. ధాన్యం చివరి గింజ వరకు కొంటామని చెప్పి..ఇప్పుడేమైంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే తాము అండగా నిలబడేవారమని, వరి సాగు వల్ల అన్ని రంగాల వారికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రత్యామ్నాయ పంటలు అంటారు..ఏం వేయాలో చెప్పరని విమర్శించారు. రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అయినా ఒక్కసారి అఖిలపక్ష సమావేశం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని…రైతులకు ధైర్యం చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...