Wednesday, January 26, 2022

kavitha : క‌వితను చివ‌రి నిముషంలో ఎమ్మెల్సీ చేయ‌డానికి కార‌ణాలు ఇవే.. | The Telugu News

kavitha :  తెలంగాణ రాజ‌కీయాలు రోజుకో ర‌కంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం ఎవ‌రి వ‌ల్ల కావ‌ట్లేదు. మొన్న‌టి వ‌ర‌కు క‌విత‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేల కోటాలో అప్ప‌టి వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న బండ ప్ర‌కాశ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో ఆ ప్లేస్ లో క‌విత‌ను పంపిస్తార‌నే ప్ర‌చారం అటు అధికార టీఆర్ ఎస్‌లో ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీల్లో విప‌రీతంగా చ‌ర్చ సాగింది. అయితే అంద‌రికీ షాక్ ఇస్తూ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారిపోయింది.

అయితే ఎవ‌రూ పోటీకి దిగ‌క పోవ‌డంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ ప‌ద‌విలో క‌విత దాదాపు ఆరేళ్లు ఉంటారు. ఇక ఆమెను మంత్రి ప‌ద‌విలోకి తీసుకుంటారా అనేది మొద‌టి నుంచి వినిపిస్తున్న ప్ర‌చారం. మ‌రి కేసీఆర్ మొద‌ట నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలో ఆకుల లలితను అనౌన్స్ చేసిన త‌ర్వాత క‌విత‌కు ఎందుకు క‌ట్ట‌బెట్టార‌న్న‌ది ఇప్పుడు అంద‌రికీ క‌లుగుతున్న ప్ర‌శ్న‌. అయితే ఇది వ్యూహాత్మ‌కంగానే జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే క‌విత‌కు రాజ్యసభ ఇష్టం లేదంట‌. ఇప్ప‌టికే ఆ ప‌ద‌వి కాలం ద‌గ్గ‌ర ప‌డ‌టం, కేవ‌లం మూడేళ్లు మాత్రమే ఉండటంతో దీనికి క‌విత ససేమిరా అన్నారంట‌.

here are some common reasons why kavitha can be emulsified at the last minute

kavitha :  రాజ్య స‌భ మూడేళ్లే ఉండ‌టంతో..

ఇందులో భాగంగానే రాష్ట్ర రాజ‌కీయా్లో మ‌ళ్లీ త‌న హ‌వా కొన‌సాగాలంటే ఇక్క‌డే ఉండ‌టం ఉత్త‌మం అని తండ్రి కేసీఆర్ కు చెప్పి మ‌రీ ఈ ప‌ద‌వి ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. ఆమె కోరిక మేర‌కు కేసీఆర్ చివ‌రి నిముషంలో ప్లాన్ చేంజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇంకో వైపు చూస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవ‌కాశం లేద‌న్న‌ట్టు తెలుస్తోంది. ఇక ప్లేస్ లో ఇంకొక‌రు పోటీ చేస్తార‌ని ప్ర‌చారం అధికార టీఆర్ ఎస్‌లో జ‌రుగుతోంది. ఇప్పుడు మంత్రి ప‌ద‌విలో ఉన్న నేత‌తో పాటు మ‌రో ఎమ్మెల్యే పేర్లు ఎంపీ సీటుకు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ బీజేపీ క్ర‌మంగా బ‌ల‌ప‌డటంతో మ‌రోసారి ఓట‌మి పాల‌వ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారంట క‌విత‌. అందుకే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది.

Related Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

Latest Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...