Sunday, January 23, 2022

Tirupati Rains : తిరుపతిలో కూలడానికి సిద్ధంగా ఉన్న 161 భవనాలు..కూల్చేస్తారా ?


తిరుపతి ప్రజలను వరుస భయాలు వెంటాడుతున్నాయి. మొన్న వరదలు, నిన్న పైకి వచ్చిన ట్యాంకర్‌.. ఇప్పుడు ఇళ్లకు పగుళ్లు. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో తెలియని భయం జనంలో కనిపిస్తోంది..

Buildings Collapse In Tirupati : తిరుపతి వాసులను పాత భవనాలు భయపెడుతున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియడం లేదు. దాదాపు 161 భవనాలు కూలడానికి సిద్ధంగా ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ భవంతుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. పాత భవనాలు కూల్చేయాలని నోటీసుల్లో వెల్లడించారు. లేనిపక్షంలో తామే కూలదోస్తామని హెచ్చరించారు.

Read More : Telangana Cabinet Meeting : సోమవారం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

మరోవైపు…తిరుపతిలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. భారీ వర్షాలు, వరదలతో.. శ్రీకృష్ణనగర్‌లో ఇళ్లు కుంగిపోగా.. వాటి కూల్చివేతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. భారీ వర్షాలకు ఓ మూడంతస్తుల భవనం కుంగిపోవడంతో పాటు.. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే.. కుంగిన భవనాన్ని కూల్చివేస్తామని శనివారం హడావుడి చేసిన అధికారులు.. ఆదివారం ఇంకా కూల్చివేతలపై ఎలంటి క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. భవనాన్ని కూల్చివేయడమే పరిష్కరామా.. లేకపోతే సాంకేతికత ఉపయోగించి సర్దుబాటు చేయొచ్చా అన్న అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. కుంగిపోయిన ఇంటి విషయంలో.. తిరుపతి ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు అధికారులు.

Read More : Smart Substations : ఏపీలో స్మార్ట్ సబ్ స్టేషన్లు.. ఉద్యోగులు లేకుండానే విద్యుత్‌ సరఫరా

ఇక.. పరిహారం ఇచ్చాకే కూల్చివేతలు చేపట్టాలంటూ శనివారం బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో.. బాధిత కుటుంబీకులతో స్థానిక ఎమ్మార్వో వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 95 వేల రూపాయల నగదు, ఒక ఇంటిని నిర్మించి ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల స్పష్టమైన హామీతో.. అక్కడ ఆందోళనలను రాత్రి సమయంలో విరమించారు బాధితులు. ప్రస్తుతం ఇళ్లు కుంగిన పరిసరాల్లో సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు పోలీసులు.

Read More : One Rupee Coin : వేలంలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిన రూపాయి నాణెం

అయితే.. శ్రీకృష్ణానగర్‌లో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనం కేవలం మూడు నెలల కిందటే పూర్తైంది. రోజు వారి హోటల్‌ నడుపుకునే ఇంటి యజమాని లక్షలు ఖర్చుపెట్టి ఇంటిని కట్టుకున్నారు. కొత్త భవనం ఇక ఇరవై, ముప్పై సంవత్సరాలు తమకు ఢోకా లేదనుకున్నారు. ఇంతలోనే రాకాసి వరదలు కొంప ముంచాయి. వరద నీరు నిల్వడం, భూగర్భ జలాలు ఉబికి వస్తుండటంతో… మూడంతస్తుల భవనం ఒకవైపు కుంగిపోయింది. బిల్డింగ్ గోడలు బీటలు వారాయి.

Read More : Rains warning: ఏపీకి హెచ్చరిక.. అతి భారీ వర్షాలు పడే అవకాశం!

మరోవైపు తిరుపతి ప్రజలను వరుస భయాలు వెంటాడుతున్నాయి. మొన్న వరదలు, నిన్న పైకి వచ్చిన ట్యాంకర్‌.. ఇప్పుడు ఇళ్లకు పగుళ్లు. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో తెలియని భయం జనంలో కనిపిస్తోంది.. శ్రీకృష్ణ నగర్‌లో ఉన్నట్టుంటి ఒక్కసారిగి ఇళ్లు కుంగిపోయాయి. దీంతో 18 ఇళ్ల గోడలు బీటలు వారాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ఇల్లు కుంగిపోతుందో, ఎప్పుడు ఎవరింటి గోడలు బీటలు వారతాయో తెలియడం లేదు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలమెల్లదీస్తున్నారు తిరుపతి నగర ప్రజలు.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...