Sunday, January 23, 2022

TDP Politburo : బాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర ? | TDP Planning Two Yatra In 2022

చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్‌ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లోగా చంద్రబాబు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటం చేయాలని..

TDP Planning Two Yatra : వచ్చే సంక్రాంతి తర్వాత చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ ప్రజల్లోనే ఉండేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్‌ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లోగా చంద్రబాబు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటం చేయాలని  భావిస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టిసారించి.. సమస్యలను పరిష్కరించనున్నారు. పార్టీ పరంగా టీడీపీ భవిష్యత్‌ కార్యాచరణను పొలిట్‌ బ్యూరో సభ్యులకు చంద్రబాబు వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభలను నిర్వహించే ఆలోచనలో ఉంది టీడీపీ.

Read More : Cyber Cheating : ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.9.5 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

టీడీపీ పొలిట్‌బ్యూరో 2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరుగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా 14 అంశాలపై చర్చ చేసి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటనలపై ప్రధానంగా టీడీపీ పొలిట్‌బ్యూరో చర్చ చేయనుంది. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, భువనేశ్వరి కించపర్చాక జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించిన తీరుపై చర్చించేందుకు పొలిట్‌బ్యూరో సభ్యులు సిద్ధపడుతున్నారు.

Read More : Dharwad : 182 మంది విద్యార్థులకు కరోనా, ఫ్రెషర్ పార్టీయే కారణమా ?

మేనత్త భువనేశ్వరిని కించపరిస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ రేంజ్‌లో వార్నింగ్‌ ఇవ్వలేదంటూ ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్‌పైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా 175 నియోజకవర్గాలకు కనీసం 100 నియోజకవర్గాల్లో రెండేళ్లు ముందుగానే అభ్యర్థులను టికెట్‌ గ్యారెంటీ ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ. దీంతో ఆయా నియోజవకవర్గాల్లో.. సదరు నేతలు ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అటు దళితులు, కాపులు,బీసీల మద్దతు కూడగట్టేలా టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...