Friday, January 28, 2022

మూడో రోజు ముగిసిన ఆట.. అంపైర్ల తప్పిదాలపై విమర్శలు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌(1)ను న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో మయాంక్ అగర్వాల్ (4), పుజారా (9) ఉన్నారు. మన బ్యాట్స్‌మెన్ నాలుగో రోజు ఆటలో ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Read Also: నవంబర్ మాసం ఆ రెండు చిత్రాలదే!

అయితే తొలి టెస్టులో చెత్త అంపైరింగ్‌తో అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల ఆటలో వీరిద్దరూ ఐదు తప్పిదాలకు పాల్పడినట్లు కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. ఈ టెస్టులో భారత బౌలర్లకు కొరకాని కొయ్యగా మారిన టామ్ లాథమ్‌ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ నాటౌట్‌ ఇచ్చాడు. ఆజింక్యా రహానె రివ్యూ తీసుకోకపోవడంతో లాథమ్ బతికిపోయాడు. అంతకుముందు పలు మార్లు రివ్యూలలో లాథమ్ బతికిపోయాడు. దీంతో రహానె రివ్యూ తీసుకునేందుకు ఇష్టపడలేదు.Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

Latest Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....