Sunday, January 23, 2022

Paddy Purchase : యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ | central government give clarity on Paddy Purchase

యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Paddy Purchase : తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల పంచాయితీకి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తుంది. వరిధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎ కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. కానీ..ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో…కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు భేటీ అయ్యారు.

చదవండి : Telangana : ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ..కేంద్రం ఏం చెబుతుంది ?

ఈ భేటీలో వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో గోయల్ వరి కొనుగోళ్లపై ఆయన స్పష్టత ఇచ్చినట్లుగా తెలిపారు నిరంజన్ రెడ్డి. వరి ధాన్యం కొనే ప్రసక్తే లేదని కేంద్రం ఖరాకండిగా చెప్పినట్లు మంత్రి వివరించారు.

చదవండి : Delhi : హైదరాబాద్‌కు వచ్చేసిన సీఎం కేసీఆర్

మొదట వానాకాలం, యాసంగి (2021-22) రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. యాసంగిలో ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెబితే రైతులకు స్పష్టత ఇస్తామని వెల్లడిస్తోంది. రెండు పంటల్లో కలిపి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం ఒకేసారి తెలపాలని సూచిస్తోంది. తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కకు పెట్టింది. ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చింది.

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి నిరంజ‌న్ రెడ్డి.. తెలంగాణ రైతాంగ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేంద్ర‌మంత్రిని క‌లిశామ‌న్నారు. మేము చాలా ఆశ‌తో ఈ స‌మావేశానికి వ‌చ్చాం. కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం నిరాశే మిగిల్చిందని అన్నారు. స‌మావేశం అసంపూర్తిగా ముగిసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్ర‌భుత్వం నుంచి సానుకూల నిర్ణ‌యం రాలేదని అన్నారు. గ‌త వారం కూడా కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వ‌లేదని తెలిపారు. ఇప్పుడు కూడా ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...