Sunday, January 23, 2022

viral news : వరుడు అరెస్ట్.. వధువు చేసిన పనికి అందరూ ఫిదా | The Telugu News

viral news.. కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఆగండి అనే వాయిస్.. వరుడు అరెస్ట్.. వధువు షాక్.. ఇదంతా తెలుగు సినిమాలో జరిగే తంతులా ఉంది కదా.. కానీ ఈ ఘటన రీల్ కాదు.. రియల్. ఇది జరిగింది ఇండియాలో కాదు.. ఈక్వెడార్ దేశంలో.. మరికాసేపట్లో దంపతులు కాబోతున్న తరుణంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లిని నిలిపివేసి పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక పెళ్లి కూతురు షాక్‌ తింది. ఆ సమయంలో ఆమె చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. వరుడును తీసుకెళ్తున్న పోలీస్ వాహనం వెనుక పరుగులు పెట్టింది. తన భర్తను వదలివేయమని ప్రాధేయపడింది. పోలీసుల కారు వెంట వధువు పరుగెడుతున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

viral news : పోలీస్ వాహ‌నం వెంట వ‌ధువు ప‌రుగులు..

groom rrested everyone paid for the work done by the bride

అయితే, విషయంలోకి వెళ్తే.. ఈక్వెడార్‌లోని ఎల్ గువాబో క్యాంటన్ నగరానికి చెందిన ప్రేమ జంట ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. పెద్దలు ఒప్పుకోవడంతో నగరంలోని ఓ చర్చిలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో వరుడు వధువుకు రింగ్ తొడుగుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి వివాహాన్ని నిలిపివేశారు. పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. హఠాత్తుగా జరిగిన ఘటనను చూసి వధువు షాక్‌కు గురైంది. పోలీసు వాహనం వద్దకు పరుగెత్తి తన భర్తను వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. ఆ వాహనం వెంటే ఆమె పరుగులు పెట్టింది. కానీ పోలీసులు మాత్రం ఆమె మొర ఆలకించలేదు.

పోలీసులు వరుడుని అరెస్ట్ చేయడం వెనుక కారణముంది. అతినికి ఇంతకుముందే పెళ్లయింది. కానీ, వారిద్దరూ అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందం ప్రకారం.. మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని అతను ఇవ్వలేదు. దీంతో మాజీ భర్తపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు మరో వివాహం చేసుకుంటాడని తెలుసుకున్న పోలీసులు.. నేరుగా చర్చికి వెళ్లి.. పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. వధువు పోలీస్ వాహనం వెంట పరుగెత్తిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. భర్త అంటే ఎంత ప్రేమో కాదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు వరుడు తీరును తప్పబడుతున్నారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...