Saturday, January 22, 2022

Telangana : ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ..కేంద్రం ఏం చెబుతుంది ? | Telangana Minister Seeks Clarity From Centre On Paddy Purchase

ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Paddy Purchase : తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల పంచాయితీకి ఫుల్ స్టాప్ పడడం లేదు. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. దీనిపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎ కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. కానీ..ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో…కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కావాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు.

Read More : Covid 19 : ఏపీలో కరోనా..ఆ జిల్లాలో సున్నా కేసులు

అందులో భాగంగా…2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం కృషి భవన్ లో ఈ భేటీ జరుగనుంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బృందం లేవనెత్తిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలియచేస్తుందని సమాచారం.

Read More : Solar Eclipse : ఆకాశంలో మరో అద్భుతం, డిసెంబర్ 04న సూర్యగ్రహణం

ఖరీఫ్, రబీ (2021-22) రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. యాసంగిలో ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెబితే రైతులకు స్పష్టత ఇస్తామని వెల్లడిస్తోంది. రెండు పంటల్లో కలిపి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం ఒకేసారి తెలపాలని సూచిస్తోంది. పారాబాయిల్డ్ రైస్ కొనేది లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియచేసింది. ముడి బియ్యమే ఎంత మేర కొంటారో స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ క్రమంలో… ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే ఉత్కంఠ నెలకొంది.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...