Friday, January 28, 2022

Jr NTR Fans : జూ.ఎన్టీఆర్ చేసిన తప్పేంటి? ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్విట్టర్‌లో #CBNShouldApologizeJRNTR ట్రెండింగ్ | Jr NTR Fans Slams on Varla Ramayaiah, CBN Should Apologize JR NTR HashTag Trending

టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్‌పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని టార్గెట్‌‌ చేయడాన్ని ఖండిస్తున్నారు.

Jr NTR Fans : టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్‌పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని టార్గెట్‌‌ చేయడాన్ని ఖండిస్తున్నారు. వర్ల రామయ్య లాంటి నేతలు.. కేవలం మీడియా ముందే హడావుడి చేస్తారని.. అలాంటి వారిని పార్టీకి దూరంగా ఉంచాలని మండిపడ్డారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత.. రామయ్యకు లేదన్నారు. అసెంబ్లీలో అంత జరిగితే మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. నరికేస్తాం.. పొడిచేస్తామని సినిమా డైలాగ్‌లు చెప్పాలా అని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో #CBNShouldApologizeJRNTR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఎన్టీఆర్ పైన టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. ఏపీ రాజకీయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీదకు మళ్లింది. జూనియర్ టార్గెట్‌గా.. టీడీపీ సీనియర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీని.. ఎందుకు చీల్చిచెండాడటం లేదని.. తెగ ఫైర్ అవుతున్నారు. టీడీపీ లీడర్ల కామెంట్స్‌కి యంగ్ టైగర్ స్పందించకపోయినా.. మంత్రి కొడాలి రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్.. తమనెందుకు కంట్రోల్‌లో పెడతారో అర్థం కావట్లేదన్నారు.

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై.. ఎన్టీఆర్ స్పందించిన తీరుతో టీడీపీ సీనియర్లు సంతృప్తి చెందలేదు. మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తిట్టకుండా.. ప్రవచనాలు చెప్పడమేంటని తెగ ఫీలైపోతున్నారు. జూనియర్ టార్గెట్‌గా టీడీపీ సీనియర్లు విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీని.. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత.. ఎన్టీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు వర్ల రామయ్య. హరికృష్ణ బతికుంటే.. సీతయ్యలా మారేవాడన్నారు. అయితే.. ఈ దుమారంపై ఎన్టీఆర్‌ ఎలా రియాక్ట్ అవుతాడన్నది టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

Read Also : Facebook Rape : ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...