Friday, January 21, 2022

13వ ఎక్కాన్ని గుర్తుచేసిన భారత క్రికెటర్లు.. సోషల్ మీడియాలో ట్రోల్స్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో తొలి రోజు టీమిండియా మంచి స్కోరే చేసింది. అయితే టీమిండియా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. ఎందుకంటే వాళ్లు చేసిన పరుగులు 13వ ఎక్కాన్ని తలపిస్తుండటమే కారణం. మయాంక్ అగర్వాల్ 13 పరుగులు, శుభ్‌మన్ గిల్ 52 పరుగులు, పుజారా 26 పరుగులు చేశారు. దీంతో వీరి స్కోర్లు 13వ ఎక్కాన్ని గుర్తుచేస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: తొలి రోజు ముగిసిన ఆట… రాణించిన అయ్యర్, జడేజా

కాగా టెస్టుల్లో టీమిండియాకు బ్యాటింగ్‌లో గోడగా భావించే పుజారా సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో చివరిసారిగా పుజారా సెంచరీ చేశాడు. ఆ టెస్టులో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అతడు ఆడిన 22 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో పుజారాపై మంచి అంచనాలు నెలకొని ఉండగా.. అతడు నిరాశపరిచాడు. 26 పరుగులకే సౌధీ బౌలింగులో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...