Friday, January 28, 2022

Chittoor Floods : బాబుకు మతిస్థిమితం లేదు..అధికార ధ్యాసే | Minister Peddireddy criticizes TDP Chief Chandrababu


Minister Peddireddy : టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ తనను అవమానిస్తోందని..సీఎంగా గెలిచిన తర్వాతే..సభలో అడుగుపెడుతానంటూ శపథం చేసి చంద్రబాబు నాయుడు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత..బాబుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా..బాబు కూడా వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా..వరద బాధితులను పరామర్శించడానికి చిత్తూరు జిల్లాకు వచ్చిన చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Read More : ACB Raids 15 officials : 15 మంది అధికారుల ఇళ్లల్లో ఏసీబీ ఒకేసారి సోదాలు..

దీనికి ప్రతిగా…మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాబుకు మతిస్థిమితం లేదని, అధికారంలోకి వచ్చాక…వరద బాధితులకు పరిహారం ఇస్తానని బాబు కడపలో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే..బాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వడం జరుగుతుందని, వరదల వల్ల ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడం జరుగుతోందన్నారు. ఊహించని నీరు రావడం వల్లే…అన్నమయ్య ప్రాజెక్టు తెగిందని స్పష్టం చేశారు. ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు.

Read More : Attack on TDP leader: టీడీపీ కార్యకర్తపై.. రాళ్లు, రాడ్లతో మూకుమ్మడి దాడి..!

మరోవైపు..చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాధితులతో బాబు మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే వరదలు పోటెత్తాయని, బాధితులను ఆదుకోవడం లేదంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎవరూ కూడా వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని, జగన్ హెలికాప్టర్ లో పర్యటించడాన్ని ఆయన తప్పుబట్టారు.

The post Chittoor Floods : బాబుకు మతిస్థిమితం లేదు..అధికార ధ్యాసే appeared first on 10TV.

Related Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

Latest Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...