Sunday, January 23, 2022

Kondapalli Municipal : నేడే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక | Election of Kondapalli Municipal Chairman today

ఏపీలో కాకరేపుతున్న కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు ఇవాళ ఎండ్ కార్డ్ పడనుంది. కొండపల్లి పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనంటూ హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది.

Kondapalli Municipal Election : ఏపీలో కాకరేపుతున్న కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు ఇవాళ ఎండ్ కార్డ్ పడనుంది. కొండపల్లి పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనంటూ హైకోర్టు అల్టిమేటం జారీ చేసింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికను ఇవాళ నిర్వహించాలంటూ  హైకోర్టు అధికారులను ఆదేశించింది. పోలీస్‌ బందోబస్తు మధ్య ఎన్నిక జరపాలని సూచించారు. అసలు ఈ ఎన్నికను ఎందుకు నిర్వహించలేదంటూ కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌, రిటర్నింగ్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు కౌన్సిల్ హాల్ లో దౌర్జన్యానికి దిగారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.

మరోవైపు ఎంపీ కేశినేని ఎక్స్‌ ఆఫిషియో ఓటు హక్కుపై కూడా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేశినేని నాని ఓటు వేసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఆ ఓటు పరిగణనలోకి తీసుకోవాలా.. వద్దా.. అన్నది మాత్రం తాము నిర్ణయిస్తామంది.. అప్పటి వరకు ఫలితాలు మాత్రం విడుదల చేయవద్దని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది హైకోర్టు. విచారణను రేపటికి వాయిదా వేసింది.

AP Assembly : కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

దీంతో ఇవాళ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. అయితే సజావుగా ఎన్నిక జరుగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇవాళ ఎన్నిక సజావుగా జరిగేలా పోలీసులు చూడాలని కోరారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...