Friday, January 28, 2022

Naga Chaitanya : ఈ విషయం మీకు తెలుసా.. అఖిల్ కాకుండా నాగచైతన్యకు మరో తమ్ముడు.. ఎక్కడున్నాడంటే? | The Telugu News

Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య సమంత నుంచి డైవోర్స్ తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. మంగళవారం నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఆయనకు అక్కినేని అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ‘బంగార్రాజు’ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ లుక్ ప్లస్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాటిలో నాగచైతన్య మోస్ట్ స్టైలిష్‌గా కనబడుతున్నాడు. ఈ సంగతులు అలా ఉంచితే..నాగచైతన్యకు అఖిల్ కాకుండా మరో బ్రదర్ ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. అతనెవరో తెలుసుకుందాం.

Naga Chaitanya : తమ్ముడి మ్యారేజ్‌కు వెళ్లిన అక్కినేని నాగచైతన్య..

naga chaitanya do you know brother of hero naga chaitanya

రామానాయుడు కూతురు అయిన లక్ష్మి-నాగార్జునల సంతానం నాగచైతన్య. మనస్పర్థల కారణంగా నాగార్జున, లక్ష్మిలు విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి కలిగిన సంతానమే అఖిల్. అలా నాగచైతన్యకు తమ్ముడు అఖిల్ ఉన్నాడన్న సంగతి దాదాపుగా అందరికీ విదితమే. కానీ, అఖిల్ కాకుండా నాగచైతన్యకు మరో తమ్ముడు ఉన్నాడు. ఎవరంటే..నాగచైతన్య తల్లి లక్ష్మి చెన్నై బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్‌ని మ్యారేజ్ చేసుకుంది. వీరి కుమారుడు కూడా నాగచైతన్యకు తమ్ముడే కదా.. కొన్నాళ్ల కిందట లక్ష్మీ తనయుడి మ్యారేజ్ జరగగా ఆ వేడుకకు నాగచైతన్య, సమంత వెళ్లొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి కూడా.

లక్ష్మి, శరత్ విజయరాఘవన్ దంపతులు చెన్నైలో ఉంటుండగా, వారి తనయుడు-కోడలు కూడా చెన్నైలో ఉంటున్నారు. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. మొత్తంగా నాగచైతన్యకు అఖిల్ మాత్రమే కాకుండా మరో సోదరుడు కూడా ఉన్నాడన్న సంగతి ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇకపోతే తండ్రీ తనయుడు నాగార్జున-నాగచైతన్య ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ..‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్. ఇందులో నాగచైతన్యకు జోడీగా ‘నాగలక్ష్మి’గా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిసనన్ నటిస్తుండగా, నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనున్నారు.

Related Articles

కార్తీకదీపం జనవరి28 శుక్రవారం ఎపిసోడ్: శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీ

కార్తీకదీపం జనవరి 28 శుక్రవారం ఎపిసోడ్ అమ్మానాన్నని చూశాను కానీ నీకు చెప్పలేదని కార్తీక్.. అత్తయ్యమావయ్యని చూశానని దీప.. చెబితే నువ్వు బాధపడతావంటే నువ్వుబాధపడతావని చెప్పలేదని...

Dwaraka Tirumala: ద్వారక తిరుమలలో పులి భయం.. దూడల మృతితో శివారు గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్..

Tiger fear in Dwaraka Tirumala: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) మండలంలో...

భారత్- మధ్య ఆసియా తొలి సదస్సు: అఫ్గన్, ఉగ్రవాదంపై మోదీ ఆందోళన

ప్రధానాంశాలు:మొదటిసారి భారత్, మధ్య ఆసియా దేశాల సదస్సు.చైనా అధినేత సమావేశమైన రెండు రోజుల్లోనే భేటీ.ప్రాంతీయ భద్రతపై భారత ప్రధాని తీవ్ర ఆందోళనప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం భారత్‌-మధ్య ఆసియాల మధ్య సహకారం...

Latest Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...