Wednesday, January 19, 2022

Daggubati Purandeswari : ఆ విషయంలో రాజీపడి ప్రసక్తే లేదు.. పురందేశ్వరి..! | The Telugu News

Daggubati Purandeswari : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తన భార్య పట్ల వైసీపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేశారని, తనకు నిండు సభలో కలిగిన అవమానానికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం కూడా చేశాడు. ఈ క్రమంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఎన్టీఆర్ కూతురు, బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను పురందేశ్వరి ఖండించారు.

Daggubati Purandeswari : ఆ వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయన్న పురందేశ్వరి..

daggabuati purandeshwari counter on Ysrcp

తాము సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లుగా ఎంతో విలువలతో పెరిగామని తెలిపారు. వైసీపీ నేతల మాటల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని అన్నారు. భువనేశ్వరిపైన చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధపెట్టాయని, భువనేశ్వరి క్యారెక్టర్‌ను కించపరచడం దారుణమైన చర్యని చెప్పారు పురందేశ్వరి. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనకు నిరసనగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉన్నప్పటికీ అప్పుడే పొలిటికల్ అట్మాస్పియర్ బాగా హీటెక్కింది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ అప్పుడే యుద్ధం ప్రకటించేసింది.

మరో వైపున బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికార వైసీపీపై పోరుకు సిద్ధమవుతున్నది. ఇక రాజకీయ క్షేత్రంలో టీడీపీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించే చాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తంగా టీడీపీ రాజకీయ క్షేత్రంలో ఇక యుద్ధం మాదిరిగా వైసీపీతో తలపడనున్నది. మరో వైపున బీజేపీ-జనసేన కూడా సంయుక్త కార్యచరణతో ముందుకు సాగే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే, గతంలో మాదిరిగా మళ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అయితే కనుక కచ్చితంగా అధికార వైసీపీని ఎన్నికల్లో ఓడించగలుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట! | Rajamouli Sekhar Kammula

‘గోదావరి’ సినిమా చేస్తున్నప్పుడు సుమంత్, కీర్తి రెడ్డి నుండి విడిపోయాడు. నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చేశారు. ఆ సినిమా అప్పుడు చై-సామ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.. ...

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు – Telugu Job Alerts 24

RRC CR Recruitment 2022 Notification : RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

Latest Articles

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...