Sunday, January 23, 2022

Heavy Flood : పెన్నా ఉగ్రరూపం..రాకపోకలు బంద్, ప్రజలు జాగ్రత్త | Heavy flood in penna river

కొన్ని గ్రామాల‌కు రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. వ‌ర‌ద నీరు గ్రామాల‌ను చుట్టుముట్టడంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. వ‌ర‌ద ఉధృతంగా ప్రవహిస్తుండ‌టంతో..

Penna River : తుపాను ప్రభావం త‌గ్గినా.. క‌డ‌ప జిల్లాలోని పెన్నా ప‌రీవాహ‌క ప్రాంతాన్ని వ‌ర‌ద‌లు వణికిస్తున్నాయి. గండికోట జ‌లాశ‌యానికి పెద్ద ఎత్తున పైభాగం నుంచి నీరు వ‌చ్చి చేర‌డంతో ఎగువ నుంచి వ‌చ్చే నీటిని య‌ధావిధిగా మైల‌వ‌రం రిజ‌ర్వాయ‌ర్‌కు వ‌ద‌లుతున్నారు. దీంతో మైల‌వ‌రం నుంచి గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ల‌క్షా 70 వేల క్యూసెక్యుల నీటిని పెన్నాన‌దిలోకి  విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా పెన్నా న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్రవహిస్తుండ‌టంతో.. స‌మీప గ్రామాలకు వ‌రద పోటెత్తింది.

Read More : Gujarati Singer : ఇదేం పిచ్చి..సింగర్‌పై డబ్బుల వర్షం, వీడియో వైరల్

కొన్ని గ్రామాల‌కు రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. వ‌ర‌ద నీరు గ్రామాల‌ను చుట్టుముట్టడంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ప్రొద్దుటూరు -ఎర్రగుంట్ల మ‌ధ్య ప్రధాన ర‌హ‌దారిలోని పెన్నా బ్రిడ్జిపై రాత్రి నుంచే రాక‌పోక‌ల‌ను ఆపేశారు. ప్రొద్దుటూరు మండ‌లంలోని చౌడూరు, సోముల‌వారిప‌ల్లె, నంగ‌నూరుప‌ల్లె, రేగ‌ళ్ల ప‌ల్లె త‌దిత‌ర గ్రామాల్లోకి పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. వ‌ర‌ద నీటిలో పంట‌ల‌న్నీ తుడిచిపెట్టుకుపోయాయి. వేల ఎక‌రాల్లో సాగుచేసిన శ‌న‌గ‌, మినుము, వ‌రి, పత్తి పంట‌ల‌కు తీవ్రన‌ష్టం వాటిల్లింది.

Read More : Sexual Abuse : కరస్పాండెంట్ వేధిస్తున్నాడని నర్సింగ్ విద్యార్ధినుల ధర్నా

2002 త‌రువాత ఇంత పెద్ద ఎత్తున పెన్నా న‌దికి నీరు రావ‌డంతో ఇదేన‌ని చెబుతున్నారు స్థానికులు. పెన్నా న‌దికి ఆనుకుని ఉన్న లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేశారు అధికారులు. ప్రొద్దుటూరులో రెండు చోట్ల స‌హాయ‌క కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు రాక‌పోక‌లు లేక‌పోవ‌డంతో జ‌మ్మల‌మ‌డుగు, ముద్దనూరు మీదుగా ఎర్రగుంట్లకు వాహ‌నాల‌ను దారి మ‌ళ్లించారు. మైల‌వ‌రం జ‌లాశ‌యం నుంచి నీటి విడుద‌ల త‌గ్గేంత వ‌ర‌కు ప్రజ‌లు జాగ్రత్తగా ఉండాల‌ని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

అది దాచినా దాగదు : శ్రుతి హాసన్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్‌కు మొదటి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. ఆమెను నెత్తిన పెట్టుకుంది కూడా...

ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో. ప్రభాస్ చేసే సినిమాల మీద అంతర్జాతీయ స్థాయి నటీనటుల కన్ను ఉంటుంది. ప్రభాస్ సినిమాలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. అలాంటి ప్రభాస్ ...

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....

Latest Articles

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

ప్రధానాంశాలు:టాక్ షోతో దుమ్ములేపుతోన్న బాలకృష్ణముగుస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్మహేష్ బాబుపై బాలయ్య కామెంట్స్నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ...