Friday, January 28, 2022

Balakrishna : మేమేం చేతులు కట్టుకుని కూర్చోలేదు.. వైసీపీకి బాలకృష్ణ వార్నింగ్.. | The Telugu News

Balakrishna : తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను అందరూ చూశారని తెలిపారు. అలాంటివి జరగడం బాధాకరమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం సజావుగా జరగాల్సిన అసెంబ్లీని.. అలా జరగనివ్వకుండా దాని దృష్టి మరల్చి.. వ్యక్తిగత విషయాలను ఎజెండాగా పెట్టుకుని మాట్లాడటంతోనే చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి పరిణామాలకు అంతకు ముందు ఎప్పుడూ జరగలేదని తెలిపారు.

అసెంబ్లీలో ఉన్న సంప్రదాయం ఎంటంటే.. సమస్యలపై కొట్లాడటమని.. అసెంబ్లీ ఉన్నది అందుకేనని చెప్పాడు. మనం వేళెత్తి చూపడం లేదంటే సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి చేసుకుంటాం. మేము ఇచ్చిన సూచనలు నచ్చకుంటే వారు వాదించడం సహజం. ప్రతిపక్షం, అధికార పక్షం ఒకరితో ఒకరు వాదించడం కామన్ అని అన్నారు. వారి పార్టీలోనూ మహిళా శాసనసభ్యులు ఉన్నారు. వారంతా ప్రజలతో ఎన్నుకోబడిన వారేని తెలిపారు. అయితే అసెంబ్లీలో సలహాలు ఇవ్వడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.

balakrishna warning to ysrcp

Balakrishna : ఆ కామెంట్స్ సరికాదన్న బాలకృష్ణ..

అంతే కానీ చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ సరికాదు. వైసీపీ నేతల భాష చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నామా? లేక గొడ్ల చావిట్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. మహిళలకు గౌరవం ఇవ్వకుండా ఇలా వ్యక్తగతంగా టార్గెట్ చేయడం సరికాదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా.. ఫ్యామిలీ విషయాలు మాట్లాడటం దురదృష్టకం. వైసీపీ నాయకుల ఇండ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వైసీపీ వారు ఇలా మాట్లాడటం మంచిది కాదు. భువనేశ్వరి చేస్తున్నట్టుగా వారేమైనా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

దోచుకున్న సొమ్మంతా ఇంట్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. వారింట్లో ఆడవాళ్లు సైతం వాళ్లను చీదరించుకుంటున్నారన్నారు. ఆ విషయం వాళ్ల ఇంట్లో వాళ్లను అడగితే తెలుస్తుందని తెలిపారు. మేమేం చేతులు కట్టుకుని కూర్చోలేదు. వాళ్ల ఫ్యామిలీలోనూ ఒక ఇష్యూ ఉంది. దానిని వాళ్ల ఫ్యామిలీ సభ్యులే ఒప్పుకున్నారు. అవును అనుమానం ఉందని అంటూ వివేక హత్య కేసు గురించి ఇండైరెక్ట్‌గా స్పందించారు.

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...