Friday, January 28, 2022

Intinti Gruhalakshmi 20 Nov Today Episode : తన కొడుకును ఇంటికి తీసుకొచ్చి.. నందును డాడీ అని పిలవాలంటూ చెప్పిన లాస్య.. నందు షాక్.. తులసి షాకింగ్ నిర్ణయం


Intinti Gruhalakshmi 20 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 482 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు వెళ్లి ఇద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయేమో అనుకున్నాం కానీ.. లాస్యను పెళ్లి చేసుకుంటా అని అంకుల్ చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది అంటుంది శృతి. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని అందరూ అనుకుంటారు. ఇంతలో తులసి వస్తుంది. ఏంటి.. మీ అందరి ముఖాల్లో ఏదో బాధ కనిపిస్తోంది అంటుంది. మీకు బాధగా అనిపించడం లేదా అని తులసిని అడుగుతారు అందరూ.

intinti gruhalakshmi 20 november 2021 full episode

ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోనూ మనం ఉండలేం. జరగని విషయాల గురించి తలుచుకొని ఏంటి లాభం. మనకు దక్కిందే ప్రాప్తం అని సంతోషపడాలి అని అందరితో అంటుంది తులసి. అమ్మ.. అలా అని నాన్న చేసే తప్పును పట్టించుకోకుండా ఉంటే జీవితంలో మరో తప్పు చేసిన దానివి అవుతావు.. అని ప్రేమ్ అంటాడు. నేను దగ్గరవ్వాలన్న తాపత్రయం.. ఆయన దగ్గర అవుతారన్న ఆశ కూడా నాకు లేదు. మేమిద్దరం ఏనాటికీ కలవం అని చెబుతుంది. అయినా మమ్మల్ని కలపడానికి మీరంతా ఎందుకు ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటుంది తులసి.

ఎందుకంటే.. ఈ ఇంటి కోడలి స్థానంలో నువ్వు తప్ప ఇంకొకరు రాకూడదు. ఇంకొకరిని ఊహించుకోలేం అని అంటుంది అనసూయ. దీంతో తులసి షాక్ అవుతుంది. ఇదే నాజీవితం.. మరిచిపోతున్న బాధను గుర్తు చేయకండి అని చెబుతుంది తులసి.

ఇంతలో లాస్య.. తన కొడుకు ఇంటికి తీసుకొస్తుంది. ఇదే నీ ఇల్లు. ఇప్పటి నుంచి ఈయనే నీ నాన్న అని నందును చూపిస్తుంది. ఇక  నుంచి నువ్వు ఈయన్నే నాన్న అని పిలవాలి.. అంటుంది. వెంటనే తులసి ఆంటిని కలిసి వస్తాను అంటాడు లక్కీ. లక్కీ బాగున్నావా.. అని హత్తుకుంటుంది తులసి.

ఎన్నిరోజులు అయిందిరా నిన్ను చూసి. ఈ ఆంటిని మరిచిపోయావా అంటుంది. లేదు ఆంటి.. మమ్మీ తీసుకురమ్మంటే తీసుకురాలేదు అంటుంది. రాత్రికి నాకు బోలెడు కథలు చెప్పాలి అంటాడు లక్కీ. సరే.. అంటుంది తులసి. నందును పిలిచి.. కొడుకును చూపిస్తుంది.

Intinti Gruhalakshmi 20 Nov Today Episode : లక్కీని చూసి చిరాకు పడిన నందు

లక్కీ నీకు డాడీ కావాలి.. డాడీ కావాలి అన్నావు కదా.. నీకు డాడీని చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజు నుంచి ఈయనే మీ డాడీ అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు. అదేంటి మమ్మీ.. ఈయన అంకుల్ కదా.. సడెన్ గా డాడీ ఎలా అయ్యారు.. అంటాడు లక్కీ. సరే.. అని డాడీ అని పిలుస్తాడు.

దీంతో నందుకు చిరాకు వస్తుంది. ఎవడ్రా నీకు డాడీ. ఇంకోసారి అలా పిలుస్తే నాలుక కోస్తాను అంటాడు నందు. ఏమైంది నందు.. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంటుంది లాస్య. ఒక్కసారిగా పిలుపు మారేసరికి నాకు ఇబ్బందిగా అనిపించింది.. అంటాడు నందు.

తులసి కూడా అడుగుతుంది. లాస్యను పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నప్పుడే తన బంధాలు.. మీ బంధాలుగా మారిపోయాయి.. అంటుంది. లాస్యను ప్రేమించినప్పుడు ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని మీకు తెలియదా అంటుంది తులసి.

తర్వాత లక్కీ.. నేను ఇక్కడ ఉండను.. హాస్టల్ కే వెళ్లిపోతాను అంటాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. నాకు భయంగా ఉంది. నిన్నటి వరకు డాడీ ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు వద్దు అనిపిస్తోంది అంటాడు లక్కీ. తొందరలోనే నేను, మీ డాడీ పెళ్లి చేసుకోబోతున్నాం. ఇక నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు అని లక్కీకి చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Related Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

Latest Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...