Sunday, January 16, 2022

Vijayasai Reddy : చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసింది, బాబు ఇక ప్రవాసాంధ్రుడు | Vijayasai Reddy Sensational Comments On Chandrababu


ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఫలితాలతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన మర్యాదపూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మున

Vijayasai Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఫలితాలతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన మర్యాదపూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దర్శి మినహాయించి అన్ని చోట్లా తామే గెలిచామన్నారు. ఈ ఫలితాలను వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారని విజయాసాయి రెడ్డి అన్నారు.

ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని, చంద్రబాబుకు గ్రహణం పట్టిందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది రాష్ట్రానికి కార్తీక పౌర్ణమి రోజని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంత ప్రజలు కూడా 98 శాతం వైసీపీకి మద్దతిచ్చారని అన్నారు. చంద్రబాబు చేసే దుష్ప్రచారం వల్లే ప్రజలు ఆయనను ఛీకొడుతున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచించుకోవాలన్నారు.

‘ఈ ప్రజాతీర్పు 2024 గెలుపునకు నాంది. ప్రకాశం జిల్లాలో దర్శి తప్ప అన్నీ వైసీపీ కైవసం చేసుకుంది. 2024 తరువాత టీడీపీ అంతర్దానం అవుతుంది. రాష్ట్రానికి ఇది ఒక కార్తీక పౌర్ణమి. చంద్రబాబుకు గ్రహణం పట్టింది. ఏపీలో చంద్రబాబు ఇకపై ప్రవాసాంధ్రుడు. చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది. ప్రజా న్యాయస్ధానంలో చంద్రబాబు మేనేజ్ చేయలేడని ఆయన గుర్తించాలి. ఇంతకు ముందు గ్రామీణం.. ఇప్పుడు నగర ప్రాంతాలు కూడా చంద్రబాబును ఓడించాయి. సీఎం జగన్ పాలన ప్రజారంజకం. రాబోయే రెండు దశాబ్దాలు సీఎం జగన్ పరిపాలిస్తారు.

TDP : ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీ పగ్గాలు అప్పగించడం మంచిది

చంద్రబాబు ప్రచారాలను అబద్ధాలను విశ్లేషించాలని.. టాక్ షోలు కొనసాగించాలని కోరుతున్నా. ఆ టాక్ షోల వల్లనే చంద్రబాబు ఓడిపోయాడు. లోకేష్, చంద్రబాబు ఇకపై పోటీ చెయ్యడానికి నియోజకవర్గాలు వెతుక్కోవాల్సిందే. లోకేష్ తండ్రిని ముంచిన తనయుడు. జగన్ తండ్రిని మించిన తనయుడు. కారు మీద కాలరెగరేసి బూతులు తిడితే సీట్లు రావని లోకేష్ గమనించాలి. రాబిన్ శర్మ అనే టీడీపీ సోషల్ మీడియా వ్యక్తిని పెట్టుకున్నాడు చంద్రబాబు. ఏం పీక్కుంటారు అని అడిగితే ప్రజలు కుప్పం పీక్కున్నారు.

అచ్చెన్నాయుడి అంచనా నిజమే… పార్టీ లేదు బొక్క లేదన్నట్టు, కుప్పం లేకుండా పోయింది. స్వయంగా కేంద్ర హోంమంత్రి చెప్పినట్టు టీడీపీ ముగిసిన అధ్యాయం. భవిష్యత్తులో సెలవు సెలవు చంద్రన్న అంటారు. భవిష్యత్తులో చంద్రబాబు ఏపీకి వచ్చే అర్హత లేకుండా పోతాడు. సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి పథకాలపై కూడా వైసీపీ దృష్టి పెడతాం. చంద్రబాబు రాసిన రాజ్యాంగం కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. చంద్రబాబు చెబితే అసెంబ్లీ రద్దు చెయ్యాలి అంటే చేసేస్తారా. డబ్బు ఖర్చు పెట్టాం అనే అర్హత చంద్రబాబుకు లేదు’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. అన్ని చోట్లా అధికార వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కైవసం చేసుకుంది.

Anil Kumar Yadav : టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చినా.. రాజీనామా చేస్తాం

ఇప్పటిదాకా అధికార పార్టీ 9 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పం, నెల్లూరు, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో జయకేతనం ఎగురవేసింది. ఇటు నెల్లూరు కార్పొరేషన్ లోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది. మొత్తం 54 డివిజన్లకు గాను 8 ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు ఎన్నిక జరిగిన 46 డివిజన్లను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీచింది. దర్శి నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో పడింది.

దర్శి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డులో ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గాను 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 3, 4, 10, 12, 13, 14, 15, 17, 18, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం
సాధించారు. అలాగే 1, 2, 5, 6, 7, 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం స్పష్టంగా కనిపించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 25 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. కేవలం 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఎన్నికలకు ముందే 14వ వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. ఈ నేపథ్యంలో వైసీపీ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు ఈ విజయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...