Sunday, January 23, 2022

Harish Rao : ఎయిమ్స్‌కి భూమి, భవనం మేమే ఇచ్చాం.. కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి | Minister Harish Rao Fires On Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్‌కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..

Harish Rao : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్‌కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని తేల్చి చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు గత ఏడాదిన్నర క్రితమే 201 ఎకరాల భూమితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బిల్డింగ్‌ను సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రానికి అందించామని తెలిపారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఇందుకు కిషన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడితే అభాసుపాలవుతారని అన్నారు. మెడికల్ కాలేజీల కోసం సంప్రదించ లేదని కిషన్ రెడ్డి అంటున్నారు, పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి హరీశ్ రావు ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పైర్ అయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లి రాజకీయం చేస్తామంటే కుదరదన్నారు హరీశ్ రావు. ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు లభించిన హక్కు అని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజల మీద ప్రేముంటే విభజన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు.

కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంపై నిజంగా ప్రేముంటే 10 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

రాజస్తాన్‌కు 23, మధ్యప్రదేశ్‌కు 12, పశ్చిమ బెంగాల్‌కు 12, తమిళనాడుకు 11 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, కానీ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించారని మంత్రి మండిపడ్డారు. ఎన్సీడీసీకి మూడెకరాలు ఇవ్వాలని ఐసీఎంఆర్‌కు లేఖ రాసినా స్పందన లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం రెండే మెడికల్ కాలేజీలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. పంజాబ్‌లో ప్రతి గింజ కొని.. తెలంగాణలో ఎందుకు కొనరని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని మాట్లాడడంతో పాటు ట్విట్టర్ ద్వారా కూడా పోస్ట్ చేయడం కిషన్ రెడ్డి బాధ్యతరాహిత్యానికి నిదర్శమన్నారు హరీష్ రావు.

Related Articles

Ramesh Babu : ర‌మేష్ బాబు పెద‌క‌ర్మ‌కు హాజ‌రైన మ‌హేష్‌..వైర‌ల్ అవుతున్న ఫొటో!

ప్రధానాంశాలు:రమేష్ బాబు పెద కర్మకు హాజరైన మహేష్కోవిడ్ నుంచి కోలుకున్న మహేష్నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో ర‌మేష్ బాబు మ‌ర‌ణం అనేది ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది....

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

ప్రధానాంశాలు:టాక్ షోతో దుమ్ములేపుతోన్న బాలకృష్ణముగుస్తున్న అన్ స్టాపబుల్ మొదటి సీజన్మహేష్ బాబుపై బాలయ్య కామెంట్స్నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (23-January-2022): ఈరోజులలో కూడా ఎక్కువమంది ఏ పని మొదలు పెట్టాలన్నా, ఫంక్షన్లు శుభకార్యాలు చేయలన్నా.. తమ...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....